Posts

Image
యుద్దం శరణం గచ్యామి  .మొదట నిప్పు పుట్టించిందెవరు  గొడ్డళ్ళు , కొడవల్లు, యుద్దానికి ఉపయొగించిన తరునమేది  దండయత్రలు మొదలుపెట్టిన దేశమేది, దేశాలు తిరిగి దొచుకున్న దొంగలెవ్వరు, చొర్ బాజార్ మ్యుజియంలు ఎక్కడ ఉన్నయ్ ప్రపంచాన్ని పంచుకున్న రాజ్యంగ తత్వాలేవి దొంగలు రాసుకున్న కూటమి వివరాలేవి  పొరాటానికి దందయాత్రకి తేడా ఏమిటి    మొత్తనికి  ఒకటి బాంబులేసే దేశం ఒకటి తగలబడ్డ దేశం  కొన్ని నాటొ దేశాలు  కొన్ని నాకెందుకులే అనుకొనే దేశాలు  కాని... చనిపొయింది మాత్రం మనిషి  బూడిదయ్యింది మత్రం మానవత్వం -సంఘహిత   

మగ జాతి

 క్షమించే గుణం స్త్రికి లేకపొతె పుట్టినప్పుడే  చనిపొయెంత  అల్ప ఆయువు  మగ జాతిది -సంఘహిత  

నా వ్యక్తిత్వం

  వద్దన్నా నా తో పాటే తిరిగే కుక్కపిల్ల నా వ్యక్తిత్వం సంఘహిత

దూరం చాలా నేర్పించింది.

 దూరం చాలా నేర్పించింది.  వేచి చూస్తే .. కాలం కుడా వనక్కి తిరిగి  చూస్తుందట   ప్రేమ ఎప్పటికైన తిరిగి వస్తుంది...   నీ జ్ఞపకాలకి సాక్షంగా..    ఆనువనువున.. గాలిలొ..నీటిలొ..ఆకాశంలొ..     నీది కాని నిన్నీలొ   ఆవతరాలు మారుస్తూ వేచి చూస్తె కాలం కూడ .. వెనక్కి చూస్తుంది..నా ప్రెయసిలా ప్రేమ శాస్వతం   ఇసక రాతల్ని ..చెరిపినా రాతి గుండె పై   మన పేర్లు రాస్తుంది    -సంఘహిత 

మనం

  మనం .. కలిసిన ప్రతిసారీ .. విడిపోతూనే ఉన్నాం కదా. విడిపోయిన ప్రతి సారి ... కలుస్తూనే ఉన్నాం కదా. అంతర్లీనమై ఆరాధన కన్నీళ్లు కురిసే కళ్ళు భరించరాని నిశ్శబ్దం సుదీర్ఘ ఎడబాటుకు సాక్షంగా ఆ చివరి క్షణం ... అయినా .. మనం విడిపోయిన ప్రతి సారి ... కలుస్తూనే ఉన్నాం కదా.. -సంఘాహిత

పశ్త్యాతాప కుర్చి

Image
పశ్త్యాతాప కుర్చి   ఇది మన ఇంట్లొనే ఉంటుంది కాని ఎవ్వరికీ కనిపించదు    ప్రపంచం పడుకున్నాక,   మరకలంటిన అద్దాన్ని మన చేత్తొ  తుడిపిస్తుంది        తప్పుల చుక్కల్ని లెక్కించి  మనం కల! అనుకొనే నిజాన్ని     తన ఒడిలొ కధలా చెబుతుంది    వివరం తెలిసి ఏడ్చెలొగా..   కల..కధగా..  కుర్చి ..మయగా.. తోస్తుంది..   -సంఘహిత 

గాయం

మనం తొందరపడి మందులేస్తం కాని గాయం అన్నాక ..మనక పోదు. -సంఘహిత