మనం

 


మనం ..
కలిసిన ప్రతిసారీ .. విడిపోతూనే ఉన్నాం కదా.
విడిపోయిన ప్రతి సారి ... కలుస్తూనే ఉన్నాం కదా.

అంతర్లీనమై ఆరాధన
కన్నీళ్లు కురిసే కళ్ళు
భరించరాని నిశ్శబ్దం
సుదీర్ఘ ఎడబాటుకు సాక్షంగా ఆ చివరి క్షణం ...

అయినా ..

మనం
విడిపోయిన ప్రతి సారి ... కలుస్తూనే ఉన్నాం కదా..

-సంఘాహిత

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం