Posts

Showing posts from February, 2024

నగరంతొ నా నడక

Image
నగరంతొ నా నడక  నేల కనిపించని చోట, నిజం కూడా ఉండదట విషాల విల్లాల్లొ బ్రతికే ఇరుకైన మనుషులు  ఎత్తైన బిల్దింగులొ ఉండే లొతు లేని బ్రతుకులు  వ్యక్తిగత స్వాతంత్రానికి,ఒంటరితనానికి  తేడా తెలియక    నలిగిపొయే అమయక జాతి ఒకవైపు  పచ్చని కొండలకు అవసరాలు వంతెన కట్టె అవకాశ వాదులు మరొవైపు డైనొసార్లు ఒకప్ప్పుడు ఉండేవట  ఇప్పుడు విలువలు.. మరో వంద యెండ్ల తరువాత చెప్పుకొనే మాట   నాలుగు పాదాల దర్మాని పై ఫ్లైయొవర్లు పడి కంపించకుండా పొయింది  పాత స్నేహాలు పరాయి దేశం పొతె  కొత్త మనుషుల్తొ చేరిన దొస్తి   వయసు వంతెన సగం దాటినాక,  నగరం తొ నా నడక  సంతొష్ దరూరి