Posts

Showing posts from September, 2024

విరళ స్వప్నం

  మెలకువను ఆపేంత ధైర్యం లేకున్నా   పగటి బాధను కమ్మే చీకటే సాయం   నిదురలోకి జారుకొనేంత తెగువ చూపకున్నా  కలల వెలుతురు దాచెంత దోసిలే ఆనందం   బహుశా...  నిదరలో మరచిన అధ్బుత విరళ స్వప్నమే.... అసలు జీవితం 

నిశ్వారం

 ప్రతి రోజు ఒక జన్మనుకొంటే తపన ఒకటే పని అనుకుంటే  గెలిచామో లేదా అనే భావం మనదే కాదనుకుంటే  సరదా క్షణాల నడుమ పరదాలు వద్దనుకుంటే  అనుకుంటే సరిపోదా  అనవసరపు రుణం తగాదా నువ్వొకడివే ఉంటే కూడా  నీతోనే ఇంకా గొడవ  నిన్ను కూడా నువ్వొదిలేస్తే విచారాల నిశ్వారం

నిశబ్ధ తరంగం

సంగీతం నన్ను ఎన్నడు వీడిపోని  ప్రేయసి పుస్తకాలు నాకు ధైర్యాన్ని ఇచ్చే స్నేహితులు ఆలొచనలు నా తొడు ఉండే  పరస్పరజ్ఞులు బ్రతుకు ఓ అర్ధయుక్త అవకాశం ఆత్మ నా నిశబ్ధ తరంగం 

అవసరం

అవసరానికి  అవతల నువ్వు ఇవతల నే ను  అంతే.... సమస్య  నాకు తెలియని నిన్ను  నీకు తెలియని నాతో  పరిచయం చేస్తుంది  దారిలొ కొన్ని  అనవసరపు ఉదయాలు  అర్ధాంతర అస్తమయాలు 

నాలొ పుట్టినవన్ని నాకే శత్రువులైతే

నాలొ పుట్టినవన్ని నాకే శత్రువులైతే  మనసు వేగాన్ని, మనిషి చేరకుంటే  కడుపున పుట్టిన ఆకలి  నుదుట ఉండే భవిశ్యత్తు  ఆత్మీయత నింపే  ప్రేమ  తలదాటి ఆవిరయే  ఆలొచనలు  ఆకలి, పేమ , ఆలొచన  మనిషి గతిని చెప్పే మనుగడ   నైస్వ్యము చూపని ప్రపంచం 

నిశ్శబ్దం

నిశ్శబ్దం మౌనం ... మాటల కంటే గొప్ప స్పందన అత్యంత శక్తివంతమైన ఆయుధం నిన్ను నువ్వు నియంత్రించు కొనే మంత్రం నిన్ను ఎవ్వరూ గెలుచుకోని యుద్దం పోరు  దారి కొన్ని సమస్యలకి గమ్యం   చేర్చదేమొ  అన్ని విమర్శలకి ప్రతిస్పందన అనవసరమేమో   మౌనం ... నీ చుట్టూ ఒక అర్థవంతమైన రాతి ప్రాకారం  నీ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే జవాబు  ప్త్రతికూల వాక్యాలకు వాకిలి దారి మౌనం....నీకు నువ్వు ఇచ్చుకొనే గౌరవం మౌనం...నీ నిశ్శబ్ద ప్రపంచం