నిశ్శబ్దం

నిశ్శబ్దం


మౌనం ... మాటల కంటే గొప్ప స్పందన

అత్యంత శక్తివంతమైన ఆయుధం

నిన్ను నువ్వు నియంత్రించు కొనే మంత్రం

నిన్ను ఎవ్వరూ గెలుచుకోని యుద్దం

పోరు  దారి కొన్ని సమస్యలకి గమ్యం   చేర్చదేమొ 

అన్ని విమర్శలకి ప్రతిస్పందన అనవసరమేమో  


మౌనం ... నీ చుట్టూ ఒక అర్థవంతమైన రాతి ప్రాకారం 

నీ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే జవాబు 

ప్త్రతికూల వాక్యాలకు వాకిలి దారి


మౌనం....నీకు నువ్వు ఇచ్చుకొనే గౌరవం

మౌనం...నీ నిశ్శబ్ద ప్రపంచం    

 


Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం