Wednesday, September 4, 2013


తంగేడీ...

ఏంత సొగసే నీది తంగేడీ
దెవా కంచనవే నువ్వు తంగెడీ
బతుకమ్మ ఎత్తిన,  మా  ఆడపడుచుల,  కళ్ళ రంగువే నువ్వు  తంగేడీ,
నీ అందం యెట్ల తక్కువ తంగెడీ..
వెన్నెలంటి నువ్వు, వెలిగి పొతావుంటే,
సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ .....
చెరువు గట్టు పక్కెంబడి,
ముచ్చటగా  పూస్తావు,
ఈ దసర నీదేలే తంగేడి...

-సంతొష్ దరూరి