Posts

Showing posts from June, 2009

వెలుగు రేఖ

Image
వెలుగు రేఖ ------------------------------------------ ఈ చీకటి పొలిమేరల్లో వెలుగు రేఖ దాగుందని నా రేపటి పొద్దుల్లొ స్వర్ణయుగం వేచుందని చీకటి కక్కే రాత్రులు నిన్నిక వెక్కిరించబోవని సామన్యుని యుద్దంలొ ఊపిరి ఇంకా మిగిలుందని పరుగాపకు పదముందుకు నిదరపొయిన సుర్యుడిని మేలుకొలిపేందుకు -సంతొష్ దరూరి

దేవుడు ... జీవుడు ..

Image
దేవుడు ... జీవుడు .. ------------------------------------------- భగవంతుడు ధనవంతుడు నిరుపేద కష్టం తానెట్లు ఎరుగెదడు మేలుకొలుపు లేనిదే నిదరైన లేవడు ఉదయించే కష్టాలకు ఎదురీతే నా గోడు ఆరగింపులు హారతులు నైవేద్యం మరువడు రొట్టె ముక్కొ, బన్ను దిబ్బొ ఆకలికి నా తొడు పవలింపు సేవతొనే నిదరొయే నా దేవుడు చేసిన కస్టానికి మురిసి అలుపు తీరే ఈ జీవుడు -సంతొష్ దరూరి

నవ లోకం

Image
కొత్తాగా కనిపించే ఉదయం, కలతనే చెరిపేయదా హాయిగా ఈ వీచే గాలి, విసుగునే మరిపించదా పొద్దులొ పూచి రేయిలొ రాలే, పూవుల జన్మొక వింత మబ్బులొ ముసురు మంచుగ మారి నా పై కురిసిందంట నా పయనం సాగాలిక , నా పాదం అలిసే దాక ఇన్ని వర్ణాలు ఉంటాయంటే నమ్మలేదా సమయం చినుకును తాకి విరబూసే హరివిల్లును చూసేనే నయనం కొమ్మల కూసి , కోనలొ ఎగిరే కొకిల గానం వింటా వంపులు తిరిగే నది వయ్యరం మురిపించేనే దారి వెంటా నా కవనం సాగాలిక , నా ఊహలు అలిసే దాక -సంతొష్ దరూరి