Posts

పదధూళి కావ్యం

ఏ షరతులు లేని అనిశ్చిత బంధువు, ఆ కధలుగా రాని నిక్షిప్త చరితవు   ఏ కుంచే వేసిందో అవిభక్తత రూపం తాత్పర్యమే లేని  పదధూళి కావ్యం

రాని చినుకుల రాక

  రాని చినుకుల రాక కొసం  తాకి చేరని మెఘ మోహం  చూపులన్ని దారి కాచి  అలసి ఋతువును వీడేపొయె 

విసిగేంత విరహం

మరీ నువ్వు దగ్గరైతె ……………..  దూరమౌతావేమో    ఇలా ఈ క్షణాలనే బ్రతిమాలి …………… . బ్రతకాలేమో   విసిగేంత విరహం ఉండి కూడా కలిసేటి కాలం మనకు రాదా?

అవ్యక్త పదకేళి

  రంగులు లేని పువ్వులు ఉండున సంద్రం చేరాని నదులుండున   అర్ధం లేని అక్షరముండున కాని   స్వప్నాలెందుకు అసంపూర్ణమో   అనుబంధాలెందుకు పరిభాషించవొ

అనంత గర్భం

అనంత గర్భం  ఆది అంతం లేది ఎవ్వడు  చూపలేని రూపమెవ్వడు  ఏది కారణమేది జననము  ఏది ఋణము ఏది పాశము   ఏది తృణము ఏది అనంతము  ఏడి ఏడని వెతకితే  నువ్వెడ ఉంటే ఆడ ఉండే చూపలేని మర్మ మకుటము  నేనున్నదే అనంత గర్భం    సంతోష్  దరూరి 

భద్రం

భద్రం   స్వార్ధం లేకుండా ఎవడూ   కలువడు నీతొ ఎన్నడు         చేయి కలిపితే... ఎవడొ ఒకరు   నీ రాతలు గుంజెస్తడు చూడు  నీ జ్ఞానం  పొట్లం కట్టి   మటల్లొ దోచేస్తరు చూడు  భద్రంగా లేవొ కొడకో బట్టలు విప్పేస్తది లొకం        సిగ్గుబిళ్లతొ సన్మానం     నువు చేసిన పాపం ప్రయాణం    సంతొష్ దరూరి      

అప్రభావిత సౌందర్యం

అప్రభావిత సౌందర్యం   అగ్నితొ జ్వలింపబడదు  వాయువుతొ చలింపబడదు  భువిలొ మిగులదుఎన్నడు   నీటిలొ ప్రావహించబడదు  నింగిలొ కలువదు ఎన్నడు   మన: బుద్ది: చిత్తమునకు  చివరంచున ప్రకాశింపబడే  సూక్ష్మ కణపు చైతన్యం  ప్రమిధా, సమిధలు లేని  అఖండ జ్వాలా తెజం   ప్రభను ఎన్నడు వీడిపోని ప్రచండ అత్మ తేజం       -సంతొష్ దరూరి