మన: చిత్తం   

ఏగసిపడి కనిపించలేని అమావాస్యపు కెరటం  
శిల్పిని ప్రెశ్నించే   రాతి స్తైర్యం
దారి తెలియని బాటసారి కాలి గాయం
రాత్రిని వెంటాడే చీకటి
నిశిలొ ఒదార్పు కోరే వ్యధలు  
దూరం తెలిపే భాధ  
బయటపడలేని గొంగలి పురుగు ఆక్రొషం
ఊహ తెలియని పసి బాలుని ఏడుపు  
చంపి జయించలేని శత్రువు  
నిలువువరించలేని వ్యసనం  
నిజం చెయలేని స్వప్నం
కాలి కింద  కనిపించక నలిగిన చిగురుటాకు
ఉండి వ్యక్తపరచలేని  ప్రేమ
విశ్వసించి నిరూపించలేని దేవుడు
చేరుకొలేని అమ్మ ఒడి  
నిశ్చల స్తిర సౌధం
నా  మన: చిత్తం

-సంఘహిత  

   




Comments

Post a Comment

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం