ఆంతర్మధనం




ఆంతర్మధనం

చప్పట్లు కనిపించని చీకటిలొ.......వినిపించక పొతె ? 
నడిచే దారే ...పాదాలను ప్రశ్నలడుగుతుంటే?     
కాగితపు పడవలొ మహ సముద్రాలీదుతుంటే ?

ఆలసిన శరీరానికి..
ఆవేదన నిండిన మనసుకు 
సాయం ఎవరు ?

నా కలం విసిరిన అక్షరాలే 
వెలుగు చినుకులౌతుంటే...
వెలుగు చూడని కావ్యం
ప్రసవించని శిశువు   
చాటలేని   సామర్ధ్యం
అలల కెరటాలు ఎత్తుకొచ్చిన ఇసక 
చేరాక కాని కనిపించవు కదా!

కనిపించకపొతే  చూపు చేరలేదనా ?   
వినిపించకపొతె ఉనికి లేదన ? 
మనసు తెరలు వీడినప్పుడు.. 
ఓడిసి పట్టలేనంత వెలుగు..
కాలాన్ని  ప్రశ్నించే తెగువ

ఓప్పుకున్నపుడే కదా ఒటమి
ఏది చాతకాన్నపుడే కదా రాజి... 
విరుచుకపడ్డపుడే కదా విజయం.. 
  

అంతా తెలిసి రాయలెనప్పుడే కదా.. 
ఆంతర్మధనం







Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు