విరహ ఋతువులు
____________
అల ఎగసిపడి తుంపరలు అలరాతిని  ముద్దాడినపుడు  ...
ఆ రాతి వియొగ విరహమే నేనై చలించినపుడు...
ఏల నువు నన్ను తడిపి మరలిపొయితివి ?

ఇసక రేణువునై  నిశి కౌగిట  నీ పౌర్ణమి చూపు పడక 
రాతిరి నీడలొ నన్నేల మరచితివి ?

శిశిర కుహరాల విమల వదనాల నీ చిత్తమేల నాకు హెమంతమయ్యెను  ? 
ఆ గ్రీష్మ జ్వాలలంటగ.. నా మరుక్షణమేల మధూచ్ఛిష్టమయ్యెను ?      

నా మస్తిష్క మనొపకలాలొ నీ చిత్ర సౌందర్యములద్దే వర్ణము 
నువ్వేల కాకపొతివి  ?  


-సంతొష్   దరూరి 

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం