ఎవ్వాడి బ్రతుకిది.
ఎవ్వాడి బ్రతుకిది..ఎవడు బ్రతికేరా !!
రాయి మలచి .. దేవుడంటిరి!!
లేని మాయలు చేస్తడంటిరి!!
ఆ రాయి కరిగి నిజము కాదేర ?
ఆ గంగనెత్తిన .. ఘనుడు రాడేరా ?
మంత్రాల మాటున ..మర్మమేదిర ?
పుట్టుకేమొ బ్రహ్మమాయట!!
బ్రతుకు పొమ్మని విష్ణు మాటట!!
శివుని అడుగుతొ జన్మ కత్తెర !!
ఆ జోగి జోలిలొ మొక్షమొచ్చెరా!!
......................
ఎవ్వాడి బ్రతుకిది..ఎవడు బ్రతికేరా !!
సంతోష్ దరూరి
Comments
Post a Comment