Wednesday, August 19, 2009

"సంసారి "

"సంసారి "
ఇంటి ముందల కురలు అమ్మా వస్తె
పది అంటే ఐదంటవ్ "సంసారి "
ఫ్రెష్ సుపెర్ మర్త్కెట్లొ పాకెట్లొ అమ్మితే
ముసుకొని కొంటావు "సంసారి "

రొడ్డెంబటి బుట్టలల్లి తక్కువకే అమ్ముతుంటే
బెరాలడుతవే "సంసారి "
పెద్ద బాజార్లలొ .. రెండికి మూడంటే
ఎగబడి కొంటావే "సంసారి "

పల్లెల్లొనే నేసి చీరలమ్మ వస్తె
చవకగా ఇమ్మంటవ్ "సంసారి "
బ్రదర్స్ షాపుల్లొ అదిరే రేట్లున్నా
బెదరకా కొంటావు "సంసారి "

బర్లను కాసి గొల్లల్లు పాలు పిండుక వస్తె
నీళ్ళు కలిపారంటవ్ "సంసారి "
ఆ పాకెట్టు పల్లల్లొ "సంసారి "
నన్యతెంతొ చెప్పు "సంసారి "

మండే ఎండల్లొన కుండలమ్మ వస్తే
నా నా వంకలు పెడతవ్ "సంసారి "
ఎల్జి సాంసంగులైనా కరంటు కొతే ఉంటే
కుండే గతి నీకు "సంసారి "

-సంతొష్ దరూరి

No comments:

Post a Comment

సాయం

సాయం పుడమిని చీల్చే దైర్యం నాకెక్కడిది.. నా తపనకు తాను సాయపడింది .. అంతే... -సంఘహిత