నా తెలుగు సిరి కన్నె వెలిగేటి విరి వన్నె నీ కాలి మువ్వల సవ్వళ్ళు నా చెవులను ముద్దాడితే నీ కన్నులు పంపిన చూపులు నా దారిలొ కనిపిస్తే అడుగులన్నీ కలిసి పరుగై నా కొసం వస్తె కాదనను ఎలా కవితా పుష్పమా -సంతొష్ దరూరి
మన: చిత్తం ఏగసిపడి కనిపించలేని అమావాస్యపు కెరటం శిల్పిని ప్రెశ్నించే రాతి స్తైర్యం దారి తెలియని బాటసారి కాలి గాయం రాత్రిని వెంటాడే చీకటి నిశిలొ ఒదార్పు కోరే వ్యధలు దూరం తెలిపే భాధ బయటపడలేని గొంగలి పురుగు ఆక్రొషం ఊహ తెలియని పసి బాలుని ఏడుపు చంపి జయించలేని శత్రువు నిలువువరించలేని వ్యసనం నిజం చెయలేని స్వప్నం కాలి కింద కనిపించక నలిగిన చిగురుటాకు ఉండి వ్యక్తపరచలేని ప్రేమ విశ్వసించి నిరూపించలేని దేవుడు చేరుకొలేని అమ్మ ఒడి నిశ్చల స్తిర సౌధం నా మన: చిత్తం -సంఘహిత
ఆంతర్మధనం చప్పట్లు కనిపించని చీకటిలొ.......వినిపించక పొతె ? నడిచే దారే ...పాదాలను ప్రశ్నలడుగుతుంటే? కాగితపు పడవలొ మహ సముద్రాలీదుతుంటే ? ఆలసిన శరీరానికి.. ఆవేదన నిండిన మనసుకు సాయం ఎవరు ? నా కలం విసిరిన అక్షరాలే వెలుగు చినుకులౌతుంటే... వెలుగు చూడని కావ్యం ప్రసవించని శిశువు చాటలేని సామర్ధ్యం అలల కెరటాలు ఎత్తుకొచ్చిన ఇసక చేరాక కాని కనిపించవు కదా! కనిపించకపొతే చూపు చేరలేదనా ? వినిపించకపొతె ఉనికి లేదన ? మనసు తెరలు వీడినప్పుడు.. ఓడిసి పట్టలేనంత వెలుగు.. కాలాన్ని ప్రశ్నించే తెగువ ఓప్పుకున్నపుడే కదా ఒటమి ఏది చాతకాన్నపుడే కదా రాజి... విరుచుకపడ్డపుడే కదా విజయం.. అంతా తెలిసి రాయలెనప్పుడే కదా.. ఆంతర్మధనం
బాపూబొమ్మకు అందమైన కవితనల్లారు.
ReplyDeletechaalaa chakkaga raasaaru :)
ReplyDeleteExcellent anna..!!!
ReplyDeletekaani ipudu aaa telugu siri kanne ekada...kevalamu kavitalaki cinemalaki parimitam ayipoinadi...ekada choosina jeanslu teashirtlu tappa achamina telugu tanamu uttipade langa ooni ekada??
Very Nice Blog....
ReplyDeleteధన్యవాదాలు.
సుదీర్
http://techwaves4u.blogspot.in
తెలుగు లో టెక్నికల్ బ్లాగు