నవ లోకం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjl2asSKXuh3nIMhp5XWC6JIvNJ0DfSDO_IcpNvHaj9ozLp_oxH3FT9-N8D_eEhPFBxLrNKOBveeF65Z6Yb1c1Sipj1djnZmEpo2y9Wo6RCtGHRooy_3shW9LnxM8AjZdFe5ku3LGHRIO91/s400/navalokam+copy+copy.jpg)
కొత్తాగా కనిపించే ఉదయం, కలతనే చెరిపేయదా
హాయిగా ఈ వీచే గాలి, విసుగునే మరిపించదా
పొద్దులొ పూచి రేయిలొ రాలే, పూవుల జన్మొక వింత
మబ్బులొ ముసురు మంచుగ మారి నా పై కురిసిందంట
నా పయనం సాగాలిక , నా పాదం అలిసే దాక
ఇన్ని వర్ణాలు ఉంటాయంటే నమ్మలేదా సమయం
చినుకును తాకి విరబూసే హరివిల్లును చూసేనే నయనం
కొమ్మల కూసి , కోనలొ ఎగిరే కొకిల గానం వింటా
వంపులు తిరిగే నది వయ్యరం మురిపించేనే దారి వెంటా
నా కవనం సాగాలిక , నా ఊహలు అలిసే దాక
-సంతొష్ దరూరి
Nice.....
ReplyDeleteసంతోష్ గారూ....
ReplyDeleteఇప్పుడే మీ కవిత్వంలో తడిచాను. మీ ఉద్వేగాన్ని అక్షరీకరించడం మానకండి. యంత్రాలతో పనిచేస్తూ కూడా యంత్రంలా మారకుండా భావుకతను బ్రతికించుకుంటున్నందుకు అభినందనలు. ఇలాంటి కవిత్వమే మనిషిలోని మనీషి తనాన్ని పట్టిస్తుంది. మరొక్క మారు అభినందనలు
---- రవికాంత్