Posts

Showing posts from April, 2009

"సాయం ఛేద్దాం "

Image
"సాయం ఛేద్దాం " కొంత మంది ఏం చెయాలొ తెలియక కాలం గడుపుతూ ఉంటారు, ఏ బార్లల్లొనొ , పేకాటల్లొనొ, తొక లేని వ్యర్ధ .రాజకీయ మరియు సినీమా చత్త చర్చలు చేస్తుంటారు. ఆలా చేయడం తప్పొ కాదొ మనకు అనవసరం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సామర్ద్యం ఉండి [UNPRODUCTIVE] గా దేనికి ఉపయోగపడకుండా బ్రతికే వాల్లను చూస్తే చాల జాలి వేస్తుంది. కత్తి తొ కూరగాయలు కోసుకోవచ్చు..... హత్యలూ చెయవచ్చు.. కాని అది ఆ కత్తి వడే మనిషి వివేకన్ని బట్టి ఉంటుంది. వివేకనికి వయసు ఉండదు ... కాని దాన్ని సరియైన వయసులో చేస్తే ఒక ఉద్యమం అవుతుంది. అలంటి ఒక సామజిక ఉద్యమమే ఈ "సాయెం చెద్దాం" యువతకు ఉండే అవేషానికి సరిహద్దుల దగ్గర తుపాకి పట్టి శత్రువు తొ పొరడి చంపవచ్చు కాని....... పొరాడాల్సింది శత్రువుతో కాదు శత్రువుత్వం తొ. చంపాల్సింది శత్రువుని కాదు శత్రువుత్వాన్ని.. మనుషుల్లో నింపాల్సింది మాత్రం మనవత్వమే ..... ఎది అర్ధం లేని సంభషణ అని మాత్రం అనికొకండి. సహయం చెసుకుంటూ పొతే మనవత్వ బీజాలని మరొ యుగానికైన మనిషిలొ నాటగలమేమొ. .................................. ఇంతటితొ నా ...

ఎదురు చూస్తా...

Image
ఎడారిలొ దోసిళ్ళతొ , అలుపెరుగని నాకళ్ళతొ ఎదురు చూస్తా... ఎదురు చూస్తా... దారులు కనిపించకుంటే, గమ్యం ఎదొ తెలియకుంటే నెనే ఒక వెలుగై నా దారిని వెతుక్కుంట నాకంటూ ఉంటుందా వక్తిత్వం నా తత్వం అనుక్షణం మార్చుకుంటే గమ్యం ఏదని లేదని కూర్చుంటే నా పయనం ఆపకుండా ఎదురు చూస్తా... ఎదురు చూస్తా... -సంతోష్ దరూరి

తెలుగంత అందంగా

Image
తెలుగంత అందంగా -------------------------- తెలుగంత అందంగా ఆ చీర కట్టీ నుదుతిపై అద్దిన తొలి పొద్దంత తిలకం గాలికి ఎగసే కురుల సొయగమే అందం చిలక పచ్చ చీర నువు కదితే అందం కటుక దిద్దిన కనుల సైయ్యాటలే అందం నువు పలికే ప్రతి మాట నే వింటే అందం -సంతొష్ దరూరి

ఓ జ్ఞాపకం

Image
నిన్ను మరపించునా నా హౄదయం కనుమరుగయ్యెనా ఆ కధనం మనసులొకటైతె మిగిలిన ఓ జ్ఞాపకం ప్రతి ఉదయం ఉదయిస్తుంటే, తొలి కిరనం నీవనుకుంటా చిరుగాలి తాకుతుంటే, నీ చూపని తలచుకుంటా ఏ పూవో నా పై రాలితే, నీ స్పర్శే దారి వెంటా ఎద పరిచి ఎన్నలైనా నువు నడిచే దారిని అవుతా. నీ అడుగుల సవ్వడి వింటే, నా గుండే చప్పుడు అనుకుంట -సంతొష్ దరూరి

ఒక్కసారి ఎదపైవాలి

Image

ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు

నిలుచుంటావెం విలాసమా ? వదనం విషాలం పరిష్కారమా ? విషాదానిది తుఫాను నైజం ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు నిలుచొని అల తల వంచు నేస్తం -సంతొష్ దరూరి

గుండే తడిమితే గుర్తుకొస్తావు

Image
________________________________________ గుండే తడిమితే గుర్తుకొస్తావు ________________________________________ కనిపించనంత దురంగ ఉన్నా, నీ జ్ఞాపకం మిగిలుందిలే వెచ్చాగా నా గుండేపై నువు తాకినా గురుతుంది లే నువు రాసిన లేఖలొ అక్షారాలని, ముద్దడితే మత్తుందిలే నీ ఉహల్లొ నన్నుండని... నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ నువు నడచిన దారుల్లొ నేను ఒంటరినా, నువు తాకిన నేలను నే ముద్దాడనా, గుండే తడిమితే గుర్తుకొస్తావు ఎంత వద్దనుకున్నా ఎదురు పడతావు నీ ఉహల్లొ నన్నుండని... నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ -సంతొష్ దరూరి

ఓ వెన్నెల వాన

ఓ వెన్నెల వాన ---------------------- ఓ వెన్నెల వాన , కురవాలి నా పైన అనువనువు నే తడిసి ఆ వెలుగు లొ కలిసి ఆ మల్లె పువుల్లొ వలపు మత్తు కై వెతకి గాలి తెమ్మరతొ కబురంపు నా చెలికి జాలిగ మేఘాలు చూసి, జాబిలి పాటకు మురిసి, కరగి నా కన్నీరునే తుడిచి ఓదార్చి పొయనే...... -సంతొష్ దరూరి