Posts

ఏదైనా

  మనదగ్గర ఉంటేనే కదా పోగొట్టుకొనేది అవసరానికి వస్తువులు ఏదైనా మనది అనుకుంటేనే కదా వదిలి పోయేది అవకాశానికి మనుష్యులు అతి సున్నితమైనవె కదా భాధింపబడేవి మనసు , హృదయం విరిగిన ముల్లు పగిలిన రాళ్ళు ఎడ్చాయని ఎక్కడా చదవలేదు

విరళ స్వప్నం

  మెలకువను ఆపేంత ధైర్యం లేకున్నా   పగటి బాధను కమ్మే చీకటే సాయం   నిదురలోకి జారుకొనేంత తెగువ చూపకున్నా  కలల వెలుతురు దాచెంత దోసిలే ఆనందం   బహుశా...  నిదరలో మరచిన అధ్బుత విరళ స్వప్నమే.... అసలు జీవితం 

నిశ్వారం

 ప్రతి రోజు ఒక జన్మనుకొంటే తపన ఒకటే పని అనుకుంటే  గెలిచామో లేదా అనే భావం మనదే కాదనుకుంటే  సరదా క్షణాల నడుమ పరదాలు వద్దనుకుంటే  అనుకుంటే సరిపోదా  అనవసరపు రుణం తగాదా నువ్వొకడివే ఉంటే కూడా  నీతోనే ఇంకా గొడవ  నిన్ను కూడా నువ్వొదిలేస్తే విచారాల నిశ్వారం

నిశబ్ధ తరంగం

సంగీతం నన్ను ఎన్నడు వీడిపోని  ప్రేయసి పుస్తకాలు నాకు ధైర్యాన్ని ఇచ్చే స్నేహితులు ఆలొచనలు నా తొడు ఉండే  పరస్పరజ్ఞులు బ్రతుకు ఓ అర్ధయుక్త అవకాశం ఆత్మ నా నిశబ్ధ తరంగం 

అవసరం

అవసరానికి  అవతల నువ్వు ఇవతల నే ను  అంతే.... సమస్య  నాకు తెలియని నిన్ను  నీకు తెలియని నాతో  పరిచయం చేస్తుంది  దారిలొ కొన్ని  అనవసరపు ఉదయాలు  అర్ధాంతర అస్తమయాలు 

నాలొ పుట్టినవన్ని నాకే శత్రువులైతే

నాలొ పుట్టినవన్ని నాకే శత్రువులైతే  మనసు వేగాన్ని, మనిషి చేరకుంటే  కడుపున పుట్టిన ఆకలి  నుదుట ఉండే భవిశ్యత్తు  ఆత్మీయత నింపే  ప్రేమ  తలదాటి ఆవిరయే  ఆలొచనలు  ఆకలి, పేమ , ఆలొచన  మనిషి గతిని చెప్పే మనుగడ   నైస్వ్యము చూపని ప్రపంచం 

నిశ్శబ్దం

నిశ్శబ్దం మౌనం ... మాటల కంటే గొప్ప స్పందన అత్యంత శక్తివంతమైన ఆయుధం నిన్ను నువ్వు నియంత్రించు కొనే మంత్రం నిన్ను ఎవ్వరూ గెలుచుకోని యుద్దం పోరు  దారి కొన్ని సమస్యలకి గమ్యం   చేర్చదేమొ  అన్ని విమర్శలకి ప్రతిస్పందన అనవసరమేమో   మౌనం ... నీ చుట్టూ ఒక అర్థవంతమైన రాతి ప్రాకారం  నీ వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే జవాబు  ప్త్రతికూల వాక్యాలకు వాకిలి దారి మౌనం....నీకు నువ్వు ఇచ్చుకొనే గౌరవం మౌనం...నీ నిశ్శబ్ద ప్రపంచం      

పదధూళి కావ్యం

ఏ షరతులు లేని అనిశ్చిత బంధువు, ఆ కధలుగా రాని నిక్షిప్త చరితవు   ఏ కుంచే వేసిందో అవిభక్తత రూపం తాత్పర్యమే లేని  పదధూళి కావ్యం

రాని చినుకుల రాక

  రాని చినుకుల రాక కొసం  తాకి చేరని మేఘ మోహం  చూపులు అన్నీ  దారి కాచి   అలసి ఋతువును  వీడి పోయే   

విసిగేంత విరహం

మరీ నువ్వు దగ్గరైతె ……………..  దూరమౌతావేమో    ఇలా ఈ క్షణాలనే బ్రతిమాలి …………… . బ్రతకాలేమో   విసిగేంత విరహం ఉండి కూడా కలిసేటి కాలం మనకు రాదా?

అవ్యక్త పదకేళి

  రంగులు లేని పువ్వులు ఉండున సంద్రం చేరాని నదులుండున   అర్ధం లేని అక్షరముండున కాని   స్వప్నాలెందుకు అసంపూర్ణమో   అనుబంధాలెందుకు పరిభాషించవొ

అనంత గర్భం

అనంత గర్భం  ఆది అంతం లేది ఎవ్వడు  చూపలేని రూపమెవ్వడు  ఏది కారణమేది జననము  ఏది ఋణము ఏది పాశము   ఏది తృణము ఏది అనంతము  ఏడి ఏడని వెతకితే  నువ్వెడ ఉంటే ఆడ ఉండే చూపలేని మర్మ మకుటము  నేనున్నదే అనంత గర్భం    సంతోష్  దరూరి 

భద్రం

భద్రం   స్వార్ధం లేకుండా ఎవడూ   కలువడు నీతొ ఎన్నడు         చేయి కలిపితే... ఎవడొ ఒకరు   నీ రాతలు గుంజెస్తడు చూడు  నీ జ్ఞానం  పొట్లం కట్టి   మటల్లొ దోచేస్తరు చూడు  భద్రంగా లేవొ కొడకో బట్టలు విప్పేస్తది లొకం        సిగ్గుబిళ్లతొ సన్మానం     నువు చేసిన పాపం ప్రయాణం    సంతొష్ దరూరి      

అప్రభావిత సౌందర్యం

అప్రభావిత సౌందర్యం   అగ్నితొ జ్వలింపబడదు  వాయువుతొ చలింపబడదు  భువిలొ మిగులదుఎన్నడు   నీటిలొ ప్రావహించబడదు  నింగిలొ కలువదు ఎన్నడు   మన: బుద్ది: చిత్తమునకు  చివరంచున ప్రకాశింపబడే  సూక్ష్మ కణపు చైతన్యం  ప్రమిధా, సమిధలు లేని  అఖండ జ్వాలా తెజం   ప్రభను ఎన్నడు వీడిపోని ప్రచండ అత్మ తేజం       -సంతొష్ దరూరి    

లొకం

తళుకు బెళుకుల లొకం  తెల్లారితె  బ్రతుకే మొసం  ఉందనుకొని నమ్మెలొగా  లేనట్టే ఉండే లొకం  చెరిపేసి రాయలేము బ్రతుకే ఓ రాతి పలక ఈ జన్మకు నీ సవాసం చెస్తాలె ఊపిరి చిలక రాలెటి సినుకులన్ని మబ్బులవి అనుకొనే లొకం   ఆ నదిలొనీల్లన్ని మబ్బుపట్టు జుర్రెసే మొసం  ఊరంతా వెలుగులు నింపే.... సూరిడే మా వాడినే లాకం అటుతిరిగి చీకటింటా.... మళ్ళొచ్చి చేసే మొసం    గమ్యం ఒకటుంటుందని.... పరుగెత్తె పిచ్చి లోకం  ఈ భూమి గుండ్రం ఆని .... ఈ నేల చెసే మొసం  నింగిలోని రంగులు చూసి...మురిసేటి ఈ లోకం చికటి లేనపుడు వచ్చి.... ఆ వెలుతురు చెసే మొసం కనిపించని గాలేమొ.... తన ప్రాణం అనుకొనే  లొకం   చెప్పకుండే వెల్లిపొయే.... ఊపిరి ప్రియురాలై మొసం     

నగరంతొ నా నడక

Image
నగరంతొ నా నడక  నేల కనిపించని చోట, నిజం కూడా ఉండదట విషాల విల్లాల్లొ బ్రతికే ఇరుకైన మనుషులు  ఎత్తైన బిల్దింగులొ ఉండే లొతు లేని బ్రతుకులు  వ్యక్తిగత స్వాతంత్రానికి,ఒంటరితనానికి  తేడా తెలియక    నలిగిపొయే అమయక జాతి ఒకవైపు  పచ్చని కొండలకు అవసరాలు వంతెన కట్టె అవకాశ వాదులు మరొవైపు డైనొసార్లు ఒకప్ప్పుడు ఉండేవట  ఇప్పుడు విలువలు.. మరో వంద యెండ్ల తరువాత చెప్పుకొనే మాట   నాలుగు పాదాల దర్మాని పై ఫ్లైయొవర్లు పడి కంపించకుండా పొయింది  పాత స్నేహాలు పరాయి దేశం పొతె  కొత్త మనుషుల్తొ చేరిన దొస్తి   వయసు వంతెన సగం దాటినాక,  నగరం తొ నా నడక  సంతొష్ దరూరి  

చిక్కుముడి

Image
చిక్కుముడి  నన్ను తాకి ఈ మంచు తెర  నిన్ను కుడా తాకిందా  ఆ తలపే నన్ను లేపి మాయమై పొయిందా  ?   కంటి మీద పరదాలు నిదుర పొరలనుకున్నా ఎదుట ఏది లేదని తెలసి  నిన్నటి మైకంలొ ఉన్న ఇది ఒకవైపుండని చిక్కుముడి ఇది ఎవరని చెప్పలేనిది మరి  దూరంగా ఉంటూ కుడా  ఒకటై ఉండే బంధం ప్రతి నిమిశం ౠతువులు మరే మరు నిమిషపు అగాధ సౌధం   సంఘహిత   

తంగేడీ

తంగేడీ... ఏంత సొగసే నీది తంగేడీ దెవా కంచనవే నువ్వు తంగెడీ బతుకమ్మ ఎత్తిన,  మా  ఆడపడుచుల,  కాళ్ళ రంగువి నువ్వె తంగెడి నీ అందం యెట్ల తక్కువ తంగెడీ.. వెన్నెలంటి నువు వెలిగి పొతావుంటే, సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ .....  తొలిపొద్దు సూరీడి  పసుపంతా దొచెసి  ఊరి గడపలకు  పూసెవు  మ బ్రతుకులు పండగ చెసెవు  ఈ దసర నీదేలే తంగేడి...

ఎంత చిత్రమో !!

Image
ఎంత చిత్రమో !!   దుప్పటంత చీకటిలొ  ఊహలన్ని చుక్కలై   నన్ను చూసి నవ్వుతుంతే  ఎంత చిత్రమో !!  రాత్రికే నిదరరాక నన్ను చూసి చంధ్రలేఖ   వెన్నెల సొనలు ఆద్దితే  ఎంత చిత్రమో !!  -సంతొష్ దరూరి

తెల్లని మల్లెలు

Image
తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   విప్లవాలై వికసిస్తాయి ఉధ్యమాలు వెదజల్లుతాయి తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   నేడు కాదు . రెపు కాదు లోకం మరిచిన నిన్నా కాదు ఏదో ఒకనాడు ఈ జండా నీడను గెలుపుంటుంది తెలంగాణ గుండె కు అలుపుంటుంది జై తెలంగాణ   సంఘహిత 2002