నిశ్వారం

 ప్రతి రోజు ఒక జన్మనుకొంటే

తపన ఒకటే పని అనుకుంటే 

గెలిచామో లేదా అనే భావం

మనదే కాదనుకుంటే 


సరదా క్షణాల నడుమ

పరదాలు వద్దనుకుంటే 

అనుకుంటే సరిపోదా 

అనవసరపు రుణం తగాదా


నువ్వొకడివే ఉంటే కూడా 

నీతోనే ఇంకా గొడవ 


నిన్ను కూడా నువ్వొదిలేస్తే

విచారాల నిశ్వారం

Comments