Posts

Showing posts from 2016

ఆమె పేరు గెలుపు

ఎన్ని సార్లు ఓడినా... గాయాలు చూసి గర్వపడమంటుంది ... నిస్సహయతలొ ఆఖరి కణానికి ఊపిరి పోస్తుంది ... ఎప్పటికైనా... తన దగ్గరకు చేరతాననే నమ్మకం.. ....ఆమె పేరు గెలుపు -సంతోష్ దరూరి

నా లొని నేను

నా లొని నేను ..స్త్రినై నా వెలుపలి నేను నాన్నై ... నన్ను నేనే కన్నాను.. నాకు నేనే నన్నని .. నేకు నేనే అమ్మని.....
ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ? చదువు విచక్షణ నేర్పింది విచక్షణ బుద్ధికి దారిచూపింది దారి... సంఘంలొ కలిసి ప్రపంచానికి కార్మికుడిగా నిలబెట్టింది  భాద్యత బరువు తూకమెంతొ చెప్పింది... మనసు వ్యాపారం చేస్తే .. ఆత్మ బానిస అయ్యింది.. ఆలోచనలు వారించే ఆధిపత్యనికి అలవాటయ్యింది.. చమట మెరుపు రుపాయి సిక్కపై పడి కళ్ళు మెరిసేవి అలసిన రెక్కలకు ఊపిరి పోస్తు మరెంతగ మారిపోను ? సత్తువున్నప్పుడు యోధుడిని చేసింది సమస్యలొ పగిలిన రాయిగ మార్చింది విచారంలొ మునిలా .... విశ్వాన్వెషణలొ మరెంతగ మారిపోను ? ఇంకెంతని విరిగిపోను? -సంతొష్ దరూరి
విరహ ఋతువులు ____________ అల ఎగసిపడి తుంపరలు అలరాతిని  ముద్దాడినపుడు  ... ఆ రాతి వియొగ విరహమే నేనై చలించినపుడు... ఏల నువు నన్ను తడిపి మరలిపొయితివి ? ఇసక రేణువునై  నిశి కౌగిట  నీ పౌర్ణమి చూపు పడక  రాతిరి నీడలొ నన్నేల మరచితివి ? శిశిర కుహరాల విమల వదనాల నీ చిత్తమేల నాకు హెమంతమయ్యెను  ?  ఆ గ్రీష్మ జ్వాలలంటగ.. నా మరుక్షణమేల మధూచ్ఛిష్టమయ్యెను ?       నా మస్తిష్క మనొపకలాలొ నీ చిత్ర సౌందర్యములద్దే వర్ణము  నువ్వేల కాకపొతివి  ?   -సంతొష్   దరూరి 

ఎవ్వాడి బ్రతుకిది.

Image
ఎవ్వాడి బ్రతుకిది..ఎవడు బ్రతికేరా !!     రాయి మలచి .. దేవుడంటిరి!!     లేని మాయలు చేస్తడంటిరి!!         ఆ రాయి కరిగి నిజము కాదేర ?   ఆ గంగనెత్తిన .. ఘనుడు రాడేరా ? మంత్రాల మాటున ..మర్మమేదిర ?     పుట్టుకేమొ బ్రహ్మమాయట!!   బ్రతుకు పొమ్మని విష్ణు  మాటట!! శివుని అడుగుతొ జన్మ కత్తెర !! ఆ  జోగి జోలిలొ మొక్షమొచ్చెరా!!       ......................     ఎవ్వాడి బ్రతుకిది..ఎవడు బ్రతికేరా !!         సంతోష్ దరూరి   
Image
రగిలేవొ... పగిలేవొ.... గురుతురాని   జ్ఞపకాల చిత్రం గీసేవో!     మిగిలేవో మలిగేవొ! ఓంటరి  అక్షరమై అర్ధం వెతికేవో! వెలిగించని చీకటి గుహలొ! ..వరమీయని దేవత శిలవొ!     నువు తాకితే  మల్లి పుట్టే .. ఫ్రతి జన్మలొ ప్రాణం నాదే! -సంతోష్ దరూరి