Posts

Showing posts from October, 2013
Image
మధురం ---- నిశిలొ దాగిన వెలుగులా,   నీ మౌనం .. నా ప్రేమను దాచుకుంది ... నిన్ను చేరని నన్ను.. మిన్ను చేరని మన్నులా,  కన్ను చేరని కలగా, మిగిల్చింది.. ఎడబాటు ఎందగా  కాసింది, నీ జ్ఞాపకం.. వెన్నెలై పూసింది, వలపు వానలొ ఇలా, రాయలేని లేఖలా.. రాగాలు తీసింది.. మరపు రావు,  కాని........మదురం నువ్వు... భాదలేదు,    కాని భారం నువ్వు... -- సంతొష్ దరూరి
Image
అగ్ని కణం ---- పడిపొయా ...కాని....ఓడిపొలేదు.. నిస్సత్తువతొ ఉన్నా...కాని నీరు కారలేదు... నింగికి ఎగిరెద నేను, మీ చూపులు మరల్చకండి... వెలుగు లేదు కాని.. నేను ఆరిపోలేదు   నిప్పుల కొలిమిది నేస్తం...నా గెలుపుకై వేచి చూడు   నిష్చల నిర్వాకాన్ని.... అచంచల నిర్వేదాన్ని.. నే మౌనన్ని.. అగ్ని కణ్ణాన్ని  .. --సంతొష్ దరూరి
ఈ మధ్య మొఖనికి క్రీము తప్ప మరేమి వ్రాయటం  లేదు     ఇంతలో ఇదేదొ రాయాలనిపిస్తే  రాసిన అంతె!    కలం -- కాగితానికి దూరమై .. కరెన్సి నోటుగానో టిశూ పేపరుగానో కనిపిస్తుంది   ! ఓకటి మనల్ని వాడుకొనేది,, మరొటి మనం వాడుకొనెది,,, మనది కాదులే  !  అనుకొడానికి ! పక్కవాడి జెబులొ రుపాయి కదుగా. నా  జీవితం.. ఖర్చు  కాక ముందు ఇట్లా! అనుకొని ఖర్చు అయిన తర్వాత అభ్భా !   అనుకొని జేబులొంచి నోటు తీసినప్పుడల్లా.. గుండే కింద జేబుకు కాటు పడి... దదాపు రక్తం   కారినంత  పని అవుతుంది ... అలారం మోగకముందే... రోజువారి బద్యతలన్నీ..   ..       కను రెప్పల వెంట్రుకలను పట్టుకొని  .. కిరాణ  షాపు షెట్టరు లేపినట్టుగ.. లేపుతున్నాయ్యి  ... ఇన్నిరోజులు ఉరుకుతున్నాం/పరిగెడుతున్నం అనుకున్నా!   యెవడో తొస్తే  కాని ... ? - సంతోష్  దరూరి