Posts

తంగేడీ

తంగేడీ... ఏంత సొగసే నీది తంగేడీ దెవా కంచనవే నువ్వు తంగెడీ బతుకమ్మ ఎత్తిన,  మా  ఆడపడుచుల,  కాళ్ళ రంగువి నువ్వె తంగెడి నీ అందం యెట్ల తక్కువ తంగెడీ.. వెన్నెలంటి నువు వెలిగి పొతావుంటే, సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ .....  తొలిపొద్దు సూరీడి  పసుపంతా దొచెసి  ఊరి గడపలకు  పూసెవు  మ బ్రతుకులు పండగ చెసెవు  ఈ దసర నీదేలే తంగేడి...

ఎంత చిత్రమో !!

Image
ఎంత చిత్రమో !!   దుప్పటంత చీకటిలొ  ఊహలన్ని చుక్కలై   నన్ను చూసి నవ్వుతుంతే  ఎంత చిత్రమో !!  రాత్రికే నిదరరాక నన్ను చూసి చంధ్రలేఖ   వెన్నెల సొనలు ఆద్దితే  ఎంత చిత్రమో !!  -సంతొష్ దరూరి

తెల్లని మల్లెలు

Image
తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   విప్లవాలై వికసిస్తాయి ఉధ్యమాలు వెదజల్లుతాయి తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   నేడు కాదు . రెపు కాదు లోకం మరిచిన నిన్నా కాదు ఏదో ఒకనాడు ఈ జండా నీడను గెలుపుంటుంది తెలంగాణ గుండె కు అలుపుంటుంది జై తెలంగాణ   సంఘహిత 2002  

డుం డుం డుం డుం..

Image
  లొకం మారిందిరా  రెక్కలు కట్టిందిరా ఎక్కడికొ ఎగురుతొంది  ఎమై పొతుందిరా మాట పొయి మొబైలొచ్చె  నడక పొయి కారులొచ్చె   నడక, నాగరికథ  మారే డుం డుం డుం డుం.. కిచిడీల   కల్చరాయె డుం డుం డుం డుం..  లెటర్ పొయి మేల్లు వచ్చె డుం డుం డుం డుం.. ప్రేమ పొయి కొరికొచె డుం డుం డుం డుం..

తంగేడి

 విప్లవం,ఉద్యమమాలతొ కూడిన ఓ ప్రేమికుడు అంతరంగం. యాభై యేండ్లు ఆయన చూసిన కళ్ళు , రాసిన కలం, పోగొట్టుకొన్న గతం ...  దాచుకున్న జ్ఞాపకం  సంపాదించిన త్రుప్తి  ఆయన విడిచిన శ్వాస
Image
యుద్దం శరణం గచ్యామి  .మొదట నిప్పు పుట్టించిందెవరు  గొడ్డళ్ళు , కొడవల్లు, యుద్దానికి ఉపయొగించిన తరునమేది  దండయత్రలు మొదలుపెట్టిన దేశమేది, దేశాలు తిరిగి దొచుకున్న దొంగలెవ్వరు, చొర్ బాజార్ మ్యుజియంలు ఎక్కడ ఉన్నయ్ ప్రపంచాన్ని పంచుకున్న రాజ్యంగ తత్వాలేవి దొంగలు రాసుకున్న కూటమి వివరాలేవి  పొరాటానికి దందయాత్రకి తేడా ఏమిటి    మొత్తనికి  ఒకటి బాంబులేసే దేశం ఒకటి తగలబడ్డ దేశం  కొన్ని నాటొ దేశాలు  కొన్ని నాకెందుకులే అనుకొనే దేశాలు  కాని... చనిపొయింది మాత్రం మనిషి  బూడిదయ్యింది మత్రం మానవత్వం -సంఘహిత   

మగ జాతి

 క్షమించే గుణం స్త్రికి లేకపొతె పుట్టినప్పుడే  చనిపొయెంత  అల్ప ఆయువు  మగ జాతిది -సంఘహిత