Posts

ఆంతర్మధనం

Image
ఆంతర్మధనం చప్పట్లు కనిపించని చీకటిలొ.......వినిపించక పొతె ?   నడిచే దారే ...పాదాలను ప్రశ్నలడుగుతుంటే?       కాగితపు పడవలొ మహ సముద్రాలీదుతుంటే ? ఆలసిన శరీరానికి.. ఆవేదన నిండిన మనసుకు   సాయం ఎవరు ? నా కలం విసిరిన అక్షరాలే   వెలుగు చినుకులౌతుంటే... వెలుగు చూడని కావ్యం ప్రసవించని శిశువు     చాటలేని   సామర్ధ్యం అలల కెరటాలు ఎత్తుకొచ్చిన ఇసక   చేరాక కాని కనిపించవు కదా! కనిపించకపొతే   చూపు చేరలేదనా ?     వినిపించకపొతె ఉనికి లేదన ?   మనసు తెరలు వీడినప్పుడు..   ఓడిసి పట్టలేనంత వెలుగు.. కాలాన్ని   ప్రశ్నించే తెగువ ఓప్పుకున్నపుడే కదా ఒటమి ఏది చాతకాన్నపుడే కదా రాజి...   విరుచుకపడ్డపుడే కదా విజయం..      అంతా తెలిసి రాయలెనప్పుడే కదా..   ఆంతర్మధనం

కొట గొడల గాంభిర్యం..

కొట గొడల గాంభిర్యం..    అవె  దారులు , శత్రువులను  నివారించిన  పరకరాలు ఊరంతా కనిపించెంత గర్వం. రహస్యాలని  బయటకు పొనివ్వని .. గొడల  ఆకారాలు    ఒకప్పటి  విజయాల గురుతులు విరగి పడెంట్టుగ ఉన్నా ... గర్వంగ  నిలబడ్డయి    పగుళ్ళను కూడ.. నరాలు అని చెప్తుంది.  యుద్దంలొ దెబ్బలకు  కింద పడ్డ రాళ్ళను   గర్వంగ చూపుతుంది    కొట గొడల్లాగ    "నిలబడి  చరిత్రను చెప్పల్సిందే" "పడిపొయి సమాధి రాళ్ళలాగ  మిగలొద్దు "         -సంఘహిత

సాయం

Image
సాయం పుడమిని చీల్చే దైర్యం నాకెక్కడిది.. నా తపనకు తాను సాయపడింది .. అంతే... -సంఘహిత
హ్రుదయం విచ్చుకొనేటప్పుడు పగిలినట్టుగా  కనిపిస్తుందు సంఘహిత

అక్షరాల చాటే

ఎప్పుడు ఈ అక్షరాల చాటే  తల దాచుకున్నా....  ఉద్వేగం పొందినపుడు  అశలు రెక్కలైనప్పుడు    కోరికలు కురుసినప్పుడు ఏప్పుడు తడవకుండా  సముద్రాన్ని ఈదుతున్నా    గాలికి కరగని గంధానై ...మంటలు  చెరచని  విరహన్నై

సందేశమే

చీకటి లొ హృయుదయం విరుచుకున్నా  ఎవరికి  తెలుస్తుంది కనిపించని చెవులకి... వినిపించె కళ్ళకు    మాత్రం తప్ప!  నీకు పంపించని లేఖ కూడా సందేశమే నువ్వు నేను కలిసి ఉన్నా .. నాకది వైరాగ్యమే నా ప్రతి మాట కవిత్వం కాకపొవచ్చు .. ప్రాసలు విరగి పడి ఉండవచ్చు  అపుడు ఈ అక్షరాలు మ్మత్రమే న వెంట నిలిచాయి  నీకు నాకు వారధిగా.....

తాను నేను - అగ్గి పుల్ల

Image
తాను నేను  - అగ్గి పుల్ల  తనని ముద్దాడిన మరుక్షణమే   వెలిగిపొతాను .. కాలిపొతాను ...   బూడిదవుతాను ... తన అనువనువు నాకు తెలుసు నేను కాలి పొవడం లేదు......   పవిత్రంగా వెలుగుతున్నను   నేను ఎక్కువ సమయం   ఉండనని తెలుసు ,   ఇంక కసెపట్లొ   బూడివుతాననీ తెలుసు , ఆ వేదనకు నేనెప్పుడు   దూరమవుతాననుకొలేదు .. తను మత్రం ఎమి చేయగలదు ?   నన్ను చూస్తు ఉండిపొయింది తను మనసిప్పుడు ఖాళి !!     మా ఇద్దారి మధ్య వెలిగెంత   ప్రేమ .. బూడిదయ్యెంత దూరం     -సంఘహిత