ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ?

చదువు విచక్షణ నేర్పింది
విచక్షణ బుద్ధికి దారిచూపింది
దారి... సంఘంలొ కలిసి ప్రపంచానికి కార్మికుడిగా నిలబెట్టింది 
భాద్యత బరువు తూకమెంతొ చెప్పింది...
మనసు వ్యాపారం చేస్తే .. ఆత్మ బానిస అయ్యింది..
ఆలోచనలు వారించే ఆధిపత్యనికి అలవాటయ్యింది..
చమట మెరుపు రుపాయి సిక్కపై పడి కళ్ళు మెరిసేవి
అలసిన రెక్కలకు ఊపిరి పోస్తు
మరెంతగ మారిపోను ?
సత్తువున్నప్పుడు యోధుడిని చేసింది
సమస్యలొ పగిలిన రాయిగ మార్చింది
విచారంలొ మునిలా ....
విశ్వాన్వెషణలొ మరెంతగ మారిపోను ?
ఇంకెంతని విరిగిపోను?
-సంతొష్ దరూరి

Comments

Popular posts from this blog

అప్రకటిత రారాజు

ఆంతర్మధనం