ఆంతర్మధనం
ఆంతర్మధనం చప్పట్లు కనిపించని చీకటిలొ.......వినిపించక పొతె ? నడిచే దారే ...పాదాలను ప్రశ్నలడుగుతుంటే? కాగితపు పడవలొ మహ సముద్రాలీదుతుంటే ? ఆలసిన శరీరానికి.. ఆవేదన నిండిన మనసుకు సాయం ఎవరు ? నా కలం విసిరిన అక్షరాలే వెలుగు చినుకులౌతుంటే... వెలుగు చూడని కావ్యం ప్రసవించని శిశువు చాటలేని సామర్ధ్యం అలల కెరటాలు ఎత్తుకొచ్చిన ఇసక చేరాక కాని కనిపించవు కదా! కనిపించకపొతే చూపు చేరలేదనా ? వినిపించకపొతె ఉనికి లేదన ? మనసు తెరలు వీడినప్పుడు.. ఓడిసి పట్టలేనంత వెలుగు.. కాలాన్ని ప్రశ్నించే తెగువ ఓప్పుకున్నపుడే కదా ఒటమి ఏది చాతకాన్నపుడే కదా రాజి... విరుచుకపడ్డపుడే కదా విజయం.. అంతా తెలిసి రాయలెనప్పుడే కదా.. ఆంతర్మధనం