Posts

Showing posts from May, 2016
ఇంకెంతని విరిగిపోను ? మరెంతగ మారిపోను ? చదువు విచక్షణ నేర్పింది విచక్షణ బుద్ధికి దారిచూపింది దారి... సంఘంలొ కలిసి ప్రపంచానికి కార్మికుడిగా నిలబెట్టింది  భాద్యత బరువు తూకమెంతొ చెప్పింది... మనసు వ్యాపారం చేస్తే .. ఆత్మ బానిస అయ్యింది.. ఆలోచనలు వారించే ఆధిపత్యనికి అలవాటయ్యింది.. చమట మెరుపు రుపాయి సిక్కపై పడి కళ్ళు మెరిసేవి అలసిన రెక్కలకు ఊపిరి పోస్తు మరెంతగ మారిపోను ? సత్తువున్నప్పుడు యోధుడిని చేసింది సమస్యలొ పగిలిన రాయిగ మార్చింది విచారంలొ మునిలా .... విశ్వాన్వెషణలొ మరెంతగ మారిపోను ? ఇంకెంతని విరిగిపోను? -సంతొష్ దరూరి
విరహ ఋతువులు ____________ అల ఎగసిపడి తుంపరలు అలరాతిని  ముద్దాడినపుడు  ... ఆ రాతి వియొగ విరహమే నేనై చలించినపుడు... ఏల నువు నన్ను తడిపి మరలిపొయితివి ? ఇసక రేణువునై  నిశి కౌగిట  నీ పౌర్ణమి చూపు పడక  రాతిరి నీడలొ నన్నేల మరచితివి ? శిశిర కుహరాల విమల వదనాల నీ చిత్తమేల నాకు హెమంతమయ్యెను  ?  ఆ గ్రీష్మ జ్వాలలంటగ.. నా మరుక్షణమేల మధూచ్ఛిష్టమయ్యెను ?       నా మస్తిష్క మనొపకలాలొ నీ చిత్ర సౌందర్యములద్దే వర్ణము  నువ్వేల కాకపొతివి  ?   -సంతొష్   దరూరి