Posts

నగరంతొ నా నడక

Image
నగరంతొ నా నడక  నేల కనిపించని చోట, నిజం కూడా ఉండదట విషాల విల్లాల్లొ బ్రతికే ఇరుకైన మనుషులు  ఎత్తైన బిల్దింగులొ ఉండే లొతు లేని బ్రతుకులు  వ్యక్తిగత స్వాతంత్రానికి,ఒంటరితనానికి  తేడా తెలియక    నలిగిపొయే అమయక జాతి ఒకవైపు  పచ్చని కొండలకు అవసరాలు వంతెన కట్టె అవకాశ వాదులు మరొవైపు డైనొసార్లు ఒకప్ప్పుడు ఉండేవట  ఇప్పుడు విలువలు.. మరో వంద యెండ్ల తరువాత చెప్పుకొనే మాట   నాలుగు పాదాల దర్మాని పై ఫ్లైయొవర్లు పడి కంపించకుండా పొయింది  పాత స్నేహాలు పరాయి దేశం పొతె  కొత్త మనుషుల్తొ చేరిన దొస్తి   వయసు వంతెన సగం దాటినాక,  నగరం తొ నా నడక  సంతొష్ దరూరి  

చిక్కుముడి

Image
చిక్కుముడి  నన్ను తాకి ఈ మంచు తెర  నిన్ను కుడా తాకిందా  ఆ తలపే నన్ను లేపి మాయమై పొయిందా  ?   కంటి మీద పరదాలు నిదుర పొరలనుకున్నా ఎదుట ఏది లేదని తెలసి  నిన్నటి మైకంలొ ఉన్న ఇది ఒకవైపుండని చిక్కుముడి ఇది ఎవరని చెప్పలేనిది మరి  దూరంగా ఉంటూ కుడా  ఒకటై ఉండే బంధం ప్రతి నిమిశం ౠతువులు మరే మరు నిమిషపు అగాధ సౌధం   సంఘహిత   

తంగేడీ

తంగేడీ... ఏంత సొగసే నీది తంగేడీ దెవా కంచనవే నువ్వు తంగెడీ బతుకమ్మ ఎత్తిన,  మా  ఆడపడుచుల,  కాళ్ళ రంగువి నువ్వె తంగెడి నీ అందం యెట్ల తక్కువ తంగెడీ.. వెన్నెలంటి నువు వెలిగి పొతావుంటే, సుక్కలకే ముద్దొస్తవ్ తంగెడీ .....  తొలిపొద్దు సూరీడి  పసుపంతా దొచెసి  ఊరి గడపలకు  పూసెవు  మ బ్రతుకులు పండగ చెసెవు  ఈ దసర నీదేలే తంగేడి...

ఎంత చిత్రమో !!

Image
ఎంత చిత్రమో !!   దుప్పటంత చీకటిలొ  ఊహలన్ని చుక్కలై   నన్ను చూసి నవ్వుతుంతే  ఎంత చిత్రమో !!  రాత్రికే నిదరరాక నన్ను చూసి చంధ్రలేఖ   వెన్నెల సొనలు ఆద్దితే  ఎంత చిత్రమో !!  -సంతొష్ దరూరి

తెల్లని మల్లెలు

Image
తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   విప్లవాలై వికసిస్తాయి ఉధ్యమాలు వెదజల్లుతాయి తెల్లని మల్లెలు ఈడ ఎర్రగా పూస్తాయి   నేడు కాదు . రెపు కాదు లోకం మరిచిన నిన్నా కాదు ఏదో ఒకనాడు ఈ జండా నీడను గెలుపుంటుంది తెలంగాణ గుండె కు అలుపుంటుంది జై తెలంగాణ   సంఘహిత 2002  

డుం డుం డుం డుం..

Image
  లొకం మారిందిరా  రెక్కలు కట్టిందిరా ఎక్కడికొ ఎగురుతొంది  ఎమై పొతుందిరా మాట పొయి మొబైలొచ్చె  నడక పొయి కారులొచ్చె   నడక, నాగరికథ  మారే డుం డుం డుం డుం.. కిచిడీల   కల్చరాయె డుం డుం డుం డుం..  లెటర్ పొయి మేల్లు వచ్చె డుం డుం డుం డుం.. ప్రేమ పొయి కొరికొచె డుం డుం డుం డుం..

తంగేడి

 విప్లవం,ఉద్యమమాలతొ కూడిన ఓ ప్రేమికుడు అంతరంగం. యాభై యేండ్లు ఆయన చూసిన కళ్ళు , రాసిన కలం, పోగొట్టుకొన్న గతం ...  దాచుకున్న జ్ఞాపకం  సంపాదించిన త్రుప్తి  ఆయన విడిచిన శ్వాస