Posts

పరవశం

Image
వలపు చెక్కిలి ఎదుట.... నా మౌనం ఎంతనే మసగా మబ్బుల వాన.....సొగసు నిగ్గుల తేనా విసగి నాపై వాల వింతేలనే........ మెరిసే అలల పై విరిసే ఉహలనే కలిసే కలలొదిగి రచించే కావ్యానికిక హద్దేలనే పరవశం నా హౄదయ మానసం విరహం నా కవన గాంధర్వం సర్వం నా స్పౄశలకు ఓ వరం ఊహలు మలచి ఊపిరి పోసిన కవితాత్మయ దౄశ్యం ....నా కవితొన్మాదం -సంతొష్ దరూరి

వింతేగా

Image
నీటిలొని చేపకు నింగి ఎత్తు ఎమి యెరుక నిన్ను యెరుగని ప్రపంచానికి ... నీ గుణమెమి యెరుకా ఉన్న చోటే నీవుండి దూరాన్ని కనలేవొయ్ పాదం కదపక ముందే దూరం అని చింతేలా ఆ గమ్యం నీ పాదం చేరుట ఇక వింతేగా --సంతొష్ దరూరి

వదిలేయి

Image
వదిలేయి అంటె వదిలేస్తామా...... గెలుపు తలపునే మరిచేమా... రాదని కాదని రాసి లేదని.. పోరాడని తత్వం పిరికివాడిది నువ్వు వేసే ప్రతి అడుగు గెలుపు దారికి మలచుకొ వద్దన్నా ఆపకు నీ పరుగు నీ రేపటినే నువు రాసుకొ తపనను దాస్తే నిజమవుతుందా తడబడుతుంటే సులువవుతుందా అందరు అన్నవి చెవులే విననీ మనసు గెలుపుతొ ముడిపడనీ -సంతొష్ దరూరి

ఎందుకో

నింగిలొ తారలు ఎందుకో .....నాలొ ఈ ఆశలు ఎందుకో చినుకులు కురిసేనెందుకో...పెదవులు అడిగేదెమితో వెన్నెల విరిసేదెందుకో...మనసులు కలిసే విందుకో భువిలొ ప్రేమలు ఎందుకో ....యదకీ విరహం ఎందుకో కారణాలు నే వెతకాల.. ఇది ఆ ప్రెమ భావమనుకొవాల.....? వాడిపోవునని తెలిసి పూవులు పూయక మానెనా నువ్వు రావని తెలిసి ఎదురే చూడక అగేనా ఏ వివరం అడగొద్దు నన్నె జాలిగ చూడొద్దు -సంతొష్ దరూరి

చిద్రం

Image
చిద్రం ఎమో ఎక్కడో నా వాళ్ళు వెతికిన దొరకని ఆనవాళ్ళు వరదలొ తెలియని దరి చేరారో కృష్ణమ్మ ఒడిలొ నిదరోయారో ........... నిన్నటి దాక నడచిన దారులు నీటి కాలువలై మారాయో వయసు మళ్ళిన ముసలాళ్ళెందరు జల సమాధులై పొయారో నేలను చీల్చి , ఇళ్ళను కూల్చి బ్రతుకులు చిద్రం చేసిన వానలు ప్రకృతి కొపమో ..ప్రభుత్వ నిర్లక్షమో -సంతొష్ దరూరి

మరిచానా ఎపుడైనా

Image
మరిచానా ఎపుడైనా గురుతు చెరప గలనా..... నీ కన్నులు చెప్పిన మాటలు కలగ మార్చుకోనా నిను విడిచి వెల్లెటప్పుడు నా గుండే చెసిన చప్పుడు గురుతుందా గురుతుందా నా గుండెను హద్దినపుడు నీ కల్లలొన తడి చూసి నా బాదను గొంతులొ దాచి వెలుతున్న వెలుతున్న నా ప్రాణం ఇక్కడ ఒదిలేసి మరిచానా ఎపుడైనా గురుతు చెరప గలనా..... సంతొష్ దరూరి

యొధ

Image
కదన రంగం నేను వెలితే కంటి చూపు కత్తి చూసి కసిగ ఎగసి కెరటమల్లె తలలు తెగి పడిన జాడలడుగు తలలు వంచిన శత్రువలనడుగు...... నెత్తురంటిన కత్తినడుగు... గెలుపు ప్రభలను పంచుకుంటూ నే వెలుగు చూపిన దారులేన్నో చీకటి ఎన్నడు దారి చూపదు నిరాశ నిన్ను గెలువనీయదు గెలువలేమని ఎవ్వరనినా నిజమైనా గెలుపంటే పొరటమని చెప్పు -సంతొష్ దరూరి