Posts

Showing posts from September, 2020

నా వ్యక్తిత్వం

  వద్దన్నా నా తో పాటే తిరిగే కుక్కపిల్ల నా వ్యక్తిత్వం సంఘహిత

దూరం చాలా నేర్పించింది.

 దూరం చాలా నేర్పించింది.  వేచి చూస్తే .. కాలం కుడా వనక్కి తిరిగి  చూస్తుందట   ప్రేమ ఎప్పటికైన తిరిగి వస్తుంది...   నీ జ్ఞపకాలకి సాక్షంగా..    ఆనువనువున.. గాలిలొ..నీటిలొ..ఆకాశంలొ..     నీది కాని నిన్నీలొ   ఆవతరాలు మారుస్తూ వేచి చూస్తె కాలం కూడ .. వెనక్కి చూస్తుంది..నా ప్రెయసిలా ప్రేమ శాస్వతం   ఇసక రాతల్ని ..చెరిపినా రాతి గుండె పై   మన పేర్లు రాస్తుంది    -సంఘహిత 

మనం

  మనం .. కలిసిన ప్రతిసారీ .. విడిపోతూనే ఉన్నాం కదా. విడిపోయిన ప్రతి సారి ... కలుస్తూనే ఉన్నాం కదా. అంతర్లీనమై ఆరాధన కన్నీళ్లు కురిసే కళ్ళు భరించరాని నిశ్శబ్దం సుదీర్ఘ ఎడబాటుకు సాక్షంగా ఆ చివరి క్షణం ... అయినా .. మనం విడిపోయిన ప్రతి సారి ... కలుస్తూనే ఉన్నాం కదా.. -సంఘాహిత

పశ్త్యాతాప కుర్చి

Image
పశ్త్యాతాప కుర్చి   ఇది మన ఇంట్లొనే ఉంటుంది కాని ఎవ్వరికీ కనిపించదు    ప్రపంచం పడుకున్నాక,   మరకలంటిన అద్దాన్ని మన చేత్తొ  తుడిపిస్తుంది        తప్పుల చుక్కల్ని లెక్కించి  మనం కల! అనుకొనే నిజాన్ని     తన ఒడిలొ కధలా చెబుతుంది    వివరం తెలిసి ఏడ్చెలొగా..   కల..కధగా..  కుర్చి ..మయగా.. తోస్తుంది..   -సంఘహిత