Posts

ఏవరని ఎవరని అడిగెవా.. ఏదపై గురుతులు చెరిపేవా.. గడిచిన రొజుల గురుతులనే మరచిపోనని అనలేవా..
Image
ఓ  నేస్తం .......... నువ్వు ఆ రోజు లేకపోతే ................ నేను ఎమైపొయెవాడినొ నేను నిన్ను ఎన్నటికి మరచిపోను నేస్తం ..... నీకు గుర్తుందో లేదో ఆ రోజు .... నా భాదను నీదనుకున్నావు.. నా ఆనందానికి కాంతివైయ్యావు   ఎంత దూరం  అయ్యామో  నేడు.. స్నెహ స్పర్షకు నోచుకోని, గెలుపు తీరంలొ  నువ్వు, నేను నువ్వు ఎక్కడ ఉన్నవొ తెలుసు  కాని.. నన్ను నేను వెన్నక్కి తలచుకోలేక పోతున్న ... ఆ రోజు నువ్వు చెప్పిన మాటలు ఇంకా గురుతున్నయి.. అవి నన్ను గెలుపు బాటలొ నడిపిస్తున్నయి... కాని నువ్వెక్కడ.. -సంతొష్ దరూరి            

ఓ కన్నీరా ..

Image
కరిగేవా అలిగి కడకు నీవైనా చెంత లేక విరాగముతొ నన్ను విడచినా ధుఖ్ఖించేది ఎవ్వడు లే...... -సంతోష్ దరూరి

యెద గానమై

Image
ఒడి ఊయలై - నువు ప్రాణమై నీ పెదవి తడిమితే ప్రేమ యెద గానమై - నెవు లొకమై నీ మనసు తెలిసె ఈ వేల నీ నొదుటి పై ముద్దు ఉదయాలే కను బొమ్మ హాయిగ నిమరాలే నీ చెక్కిలి తాకితే అలా ...సంధ్యా కాంతులే స్పౄశించగా నీ కాటుక చీకటిగా... నే విరిసె వెన్నెలగా -సంతోష్ దరూరి

ఆశే కదా నడిపేది

Image
సగమే కదా గడిచింది - వరమే కదా మిగిలుంది మెరిసే క్షణం ఒకటుందనే - ఆశే కదా నడిపేది ఏదీ కదొయ్ మజిలి - అది తెలిసే లొపే బదిలి ఉదయం తొనే దిగులు - చీకటి లొనే కరుగు విసుగంటుంటే పతిక్షణం -కరిగే సమయం నీదెగా రోజు బ్రతుకే ఓ వరం - నవ్వే క్షణమే అత్బుతం -సంతోష్ దరూరి

ఎందుకొ గురుతుకు వచ్చాయి

గురుతుగా దాచుకుంట గుండెకే హద్దుకుంట నేస్తమా... నీ ఙ్నాపకం నిను చూడని దూరం ఎంతంటే యెద తలుపు తెరిచే ఘడియంతె నేస్తమా నీతొ నడిచాలే... మరపు రాని రోజులు గడిచాయె ఎందుకొ గురుతుకు వచ్చాయి కనులెదుట ఆసగ నిలిచాయి -సంతోష్ దరూరి

వలపు వర్ణం

Image
వలపు వర్ణం ------------- ప్రేమ సుమాలు ఇలా రాలిపోతూనే ఉంటాయి గాయం ఇదని తెలిసే లోగ మనసు కుదుపి వేస్తునే ఉంటాయి ఆ వలపు దారులలొ అందరి లాగే నేనూ కూడ ఎదురు పడితే చెబుదామని ... ఎవరికైనా తొలి ప్రేమ జళ్ళు కురియగానే , వలపు వర్ణం మారుతుంది వింతగా కమ్మిన మేఘం అంతలోనే ఆవిరవుతుంది -సంతొష్ దరూరి