Posts

వెలుగు రేఖ

Image
వెలుగు రేఖ ------------------------------------------ ఈ చీకటి పొలిమేరల్లో వెలుగు రేఖ దాగుందని నా రేపటి పొద్దుల్లొ స్వర్ణయుగం వేచుందని చీకటి కక్కే రాత్రులు నిన్నిక వెక్కిరించబోవని సామన్యుని యుద్దంలొ ఊపిరి ఇంకా మిగిలుందని పరుగాపకు పదముందుకు నిదరపొయిన సుర్యుడిని మేలుకొలిపేందుకు -సంతొష్ దరూరి

దేవుడు ... జీవుడు ..

Image
దేవుడు ... జీవుడు .. ------------------------------------------- భగవంతుడు ధనవంతుడు నిరుపేద కష్టం తానెట్లు ఎరుగెదడు మేలుకొలుపు లేనిదే నిదరైన లేవడు ఉదయించే కష్టాలకు ఎదురీతే నా గోడు ఆరగింపులు హారతులు నైవేద్యం మరువడు రొట్టె ముక్కొ, బన్ను దిబ్బొ ఆకలికి నా తొడు పవలింపు సేవతొనే నిదరొయే నా దేవుడు చేసిన కస్టానికి మురిసి అలుపు తీరే ఈ జీవుడు -సంతొష్ దరూరి

నవ లోకం

Image
కొత్తాగా కనిపించే ఉదయం, కలతనే చెరిపేయదా హాయిగా ఈ వీచే గాలి, విసుగునే మరిపించదా పొద్దులొ పూచి రేయిలొ రాలే, పూవుల జన్మొక వింత మబ్బులొ ముసురు మంచుగ మారి నా పై కురిసిందంట నా పయనం సాగాలిక , నా పాదం అలిసే దాక ఇన్ని వర్ణాలు ఉంటాయంటే నమ్మలేదా సమయం చినుకును తాకి విరబూసే హరివిల్లును చూసేనే నయనం కొమ్మల కూసి , కోనలొ ఎగిరే కొకిల గానం వింటా వంపులు తిరిగే నది వయ్యరం మురిపించేనే దారి వెంటా నా కవనం సాగాలిక , నా ఊహలు అలిసే దాక -సంతొష్ దరూరి

నా గమనంలొ

Image
నా గమనంలొ -------------------------- దిశలేని గమనానికి ,దశ మారేదెన్నడొ నీవు గాని , నేను గాని , ఎవ్వరు గాని.......... వలచి,తలచి విసిగినా... నడచి నడచి అలిసినా..... రాని అవరొధాలు ..... రాని ఎడతెగని బాధలు భయం నాస్తి... భాధ నాస్తి ..... నిట్టూర్పుకు స్వస్తి .... నిన్నెవ్వరు వీడినా గాని తొడెవ్వరు లేకుంటేనేమి విశ్వమంతా శూన్యం లొ కలిసిపోయే రోజు రాని నీ స్వప్నం నీ కొసం ఉద్భవించు గమనంలొ రెప్ప వేయక ఎదురు చూడు నిర్వాన సౌధం లొ సంతొష్ దరూరి

"సాయం ఛేద్దాం "

Image
"సాయం ఛేద్దాం " కొంత మంది ఏం చెయాలొ తెలియక కాలం గడుపుతూ ఉంటారు, ఏ బార్లల్లొనొ , పేకాటల్లొనొ, తొక లేని వ్యర్ధ .రాజకీయ మరియు సినీమా చత్త చర్చలు చేస్తుంటారు. ఆలా చేయడం తప్పొ కాదొ మనకు అనవసరం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సామర్ద్యం ఉండి [UNPRODUCTIVE] గా దేనికి ఉపయోగపడకుండా బ్రతికే వాల్లను చూస్తే చాల జాలి వేస్తుంది. కత్తి తొ కూరగాయలు కోసుకోవచ్చు..... హత్యలూ చెయవచ్చు.. కాని అది ఆ కత్తి వడే మనిషి వివేకన్ని బట్టి ఉంటుంది. వివేకనికి వయసు ఉండదు ... కాని దాన్ని సరియైన వయసులో చేస్తే ఒక ఉద్యమం అవుతుంది. అలంటి ఒక సామజిక ఉద్యమమే ఈ "సాయెం చెద్దాం" యువతకు ఉండే అవేషానికి సరిహద్దుల దగ్గర తుపాకి పట్టి శత్రువు తొ పొరడి చంపవచ్చు కాని....... పొరాడాల్సింది శత్రువుతో కాదు శత్రువుత్వం తొ. చంపాల్సింది శత్రువుని కాదు శత్రువుత్వాన్ని.. మనుషుల్లో నింపాల్సింది మాత్రం మనవత్వమే ..... ఎది అర్ధం లేని సంభషణ అని మాత్రం అనికొకండి. సహయం చెసుకుంటూ పొతే మనవత్వ బీజాలని మరొ యుగానికైన మనిషిలొ నాటగలమేమొ. .................................. ఇంతటితొ నా ...

ఎదురు చూస్తా...

Image
ఎడారిలొ దోసిళ్ళతొ , అలుపెరుగని నాకళ్ళతొ ఎదురు చూస్తా... ఎదురు చూస్తా... దారులు కనిపించకుంటే, గమ్యం ఎదొ తెలియకుంటే నెనే ఒక వెలుగై నా దారిని వెతుక్కుంట నాకంటూ ఉంటుందా వక్తిత్వం నా తత్వం అనుక్షణం మార్చుకుంటే గమ్యం ఏదని లేదని కూర్చుంటే నా పయనం ఆపకుండా ఎదురు చూస్తా... ఎదురు చూస్తా... -సంతోష్ దరూరి

తెలుగంత అందంగా

Image
తెలుగంత అందంగా -------------------------- తెలుగంత అందంగా ఆ చీర కట్టీ నుదుతిపై అద్దిన తొలి పొద్దంత తిలకం గాలికి ఎగసే కురుల సొయగమే అందం చిలక పచ్చ చీర నువు కదితే అందం కటుక దిద్దిన కనుల సైయ్యాటలే అందం నువు పలికే ప్రతి మాట నే వింటే అందం -సంతొష్ దరూరి