Tuesday, November 3, 2009

వదిలేయి


వదిలేయి అంటె వదిలేస్తామా......
గెలుపు తలపునే మరిచేమా...
రాదని కాదని రాసి లేదని..
పోరాడని తత్వం పిరికివాడిది
నువ్వు వేసే ప్రతి అడుగు గెలుపు దారికి మలచుకొ
వద్దన్నా ఆపకు నీ పరుగు నీ రేపటినే నువు రాసుకొ
తపనను దాస్తే నిజమవుతుందా
తడబడుతుంటే సులువవుతుందా
అందరు అన్నవి చెవులే విననీ
మనసు గెలుపుతొ ముడిపడనీ

-సంతొష్ దరూరి

Tuesday, October 27, 2009

ఎందుకో

నింగిలొ తారలు ఎందుకో .....నాలొ ఈ ఆశలు ఎందుకో
చినుకులు కురిసేనెందుకో...పెదవులు అడిగేదెమితో
వెన్నెల విరిసేదెందుకో...మనసులు కలిసే విందుకో
భువిలొ ప్రేమలు ఎందుకో ....యదకీ విరహం ఎందుకో
కారణాలు నే వెతకాల.. ఇది ఆ ప్రెమ భావమనుకొవాల.....?

వాడిపోవునని తెలిసి పూవులు పూయక మానెనా
నువ్వు రావని తెలిసి ఎదురే చూడక అగేనా
ఏ వివరం అడగొద్దు నన్నె జాలిగ చూడొద్దు

-సంతొష్ దరూరి

Tuesday, October 13, 2009

చిద్రంచిద్రం

ఎమో ఎక్కడో నా వాళ్ళు
వెతికిన దొరకని ఆనవాళ్ళు
వరదలొ తెలియని దరి చేరారో
కృష్ణమ్మ ఒడిలొ నిదరోయారో ...........
నిన్నటి దాక నడచిన దారులు
నీటి కాలువలై మారాయో
వయసు మళ్ళిన ముసలాళ్ళెందరు
జల సమాధులై పొయారో
నేలను చీల్చి , ఇళ్ళను కూల్చి
బ్రతుకులు చిద్రం చేసిన వానలు
ప్రకృతి కొపమో ..ప్రభుత్వ నిర్లక్షమో


-సంతొష్ దరూరి

Friday, September 18, 2009

మరిచానా ఎపుడైనా

మరిచానా ఎపుడైనా
గురుతు చెరప గలనా.....

నీ కన్నులు చెప్పిన మాటలు
కలగ మార్చుకోనా

నిను విడిచి వెల్లెటప్పుడు
నా గుండే చెసిన చప్పుడు
గురుతుందా గురుతుందా
నా గుండెను హద్దినపుడు

నీ కల్లలొన తడి చూసి
నా బాదను గొంతులొ దాచి
వెలుతున్న వెలుతున్న
నా ప్రాణం ఇక్కడ ఒదిలేసి

మరిచానా ఎపుడైనా
గురుతు చెరప గలనా.....

సంతొష్ దరూరి

Thursday, August 27, 2009

యొధకదన రంగం నేను వెలితే కంటి చూపు కత్తి చూసి
కసిగ ఎగసి కెరటమల్లె తలలు తెగి పడిన జాడలడుగు
తలలు వంచిన శత్రువలనడుగు......
నెత్తురంటిన కత్తినడుగు...
గెలుపు ప్రభలను పంచుకుంటూ
నే వెలుగు చూపిన దారులేన్నో
చీకటి ఎన్నడు దారి చూపదు
నిరాశ నిన్ను గెలువనీయదు
గెలువలేమని ఎవ్వరనినా
నిజమైనా గెలుపంటే పొరటమని చెప్పు
-సంతొష్ దరూరి

Thursday, August 20, 2009

నా తరమా


బాదలెన్నైనాగాని ఓపితి నే ఓర్పుతొ
వరముగ ఇచ్చిన సౌక్యములన్ని ఓపా నా తరమా

వాంచలన్నియు నేటికి వాయుప్రియమైనాయీ
సంపద కూర్చిన సిరులు తరగి కరగినాయీ
ఎందెందో వెతకితి నే సుఖముల జాడల నీడలు
ఇందిందే కలదంటూ .. నా అత్మ చూపినవా .. దేవా.


చేసిన యుద్దలన్ని చెరితగనే మారుతాయీ
నిత్య సంఘర్షనెపుడు నాలొనే జరుగుతుంది
ఈ రాణల కారణాలు తెలిసేది ఎన్నటికో
నేడై నా రేపటిలొ మొక్షమివ్వు దేవా.....

-సంతొష్ దరూరి

Wednesday, August 19, 2009

"సంసారి "

"సంసారి "
ఇంటి ముందల కురలు అమ్మా వస్తె
పది అంటే ఐదంటవ్ "సంసారి "
ఫ్రెష్ సుపెర్ మర్త్కెట్లొ పాకెట్లొ అమ్మితే
ముసుకొని కొంటావు "సంసారి "

రొడ్డెంబటి బుట్టలల్లి తక్కువకే అమ్ముతుంటే
బెరాలడుతవే "సంసారి "
పెద్ద బాజార్లలొ .. రెండికి మూడంటే
ఎగబడి కొంటావే "సంసారి "

పల్లెల్లొనే నేసి చీరలమ్మ వస్తె
చవకగా ఇమ్మంటవ్ "సంసారి "
బ్రదర్స్ షాపుల్లొ అదిరే రేట్లున్నా
బెదరకా కొంటావు "సంసారి "

బర్లను కాసి గొల్లల్లు పాలు పిండుక వస్తె
నీళ్ళు కలిపారంటవ్ "సంసారి "
ఆ పాకెట్టు పల్లల్లొ "సంసారి "
నన్యతెంతొ చెప్పు "సంసారి "

మండే ఎండల్లొన కుండలమ్మ వస్తే
నా నా వంకలు పెడతవ్ "సంసారి "
ఎల్జి సాంసంగులైనా కరంటు కొతే ఉంటే
కుండే గతి నీకు "సంసారి "

-సంతొష్ దరూరి

Tuesday, August 18, 2009

విశాఖవిశాఖ
తొలిపొద్దుల కిరణాల వెలుగు వన్నెలొసగ
తూరుపు దిశలో ఉన్న మణి తీరముగ
తెలుగు గుండే తలపించే ౠషికొండే దీటుగా
నిన్నటి సొగసుల పొదిగి, రెపటి ప్రగతి దిశగా
శ్రీ శ్రీ నడిచిన ఇసక
నే నెరిగిన విశాఖ
-సంతొష్ దరూరి

Thursday, August 13, 2009

తెలుగు సిరి కన్నె


నా తెలుగు సిరి కన్నె
వెలిగేటి విరి వన్నె
నీ కాలి మువ్వల సవ్వళ్ళు నా చెవులను ముద్దాడితే
నీ కన్నులు పంపిన చూపులు నా దారిలొ కనిపిస్తే
అడుగులన్నీ కలిసి పరుగై నా కొసం వస్తె
కాదనను ఎలా కవితా పుష్పమా
-సంతొష్ దరూరి

Thursday, August 6, 2009

అర కొర

నిక్కముగా రొక్కము ఒక పక్కకైనా నిలువదాయె
చిల్లి పడ్డ కుండ వొలే,
చింత పిక్కల వొలే,

పొయిoన్రనో.... వచ్చిoన్రనో....
అడ్డుకట్ట లేక పాయె,
అర కొరైనా మిగలదాయె,

దెహి అనొ .. పాహి అనొ..
పావల.. పరకకనో...

ఆడ తవ్వి ... ఈడ పూడ్చి
ఈడ తవ్వి... ఆడ పూడ్చి..

ఎందాకో అప్పులాట

-సంతొష్ దరూరి

క్రెడిట్ కార్డు

కంటి దురదా
చేతి సరదా
అప్పు పరదా
లిమిట్ మీరదా
క్రెడిట్ ఫార్ములా

-సంతొష్ దరూరి

ప్రభంజనం

పలికిన ఒక్క పదము పలికించిన వెయి నోళ్ళ
ప్రపంచమెరుగని ప్రగతికి ఓంకరమౌతుంది

వెలిగిన ఒక్క దీపం వెలిగించిన అన్ని ఊళ్ళ
చీకటి కమ్మిన బ్రతుకుల దారి చూపుతుంది

మంచి కోరితే మనం
చేయి కలుపరెం జనం
మేలుకొలిపి అందరికీ చూపించు ప్రభంజనం

-సంతొష్ దరూరి

నే మార్చలేను


నే మార్చలేను
కనిపించే మనుషుల్లొ విలువెంతొ చూడు
వినిపించే నవుల్లొ నిజమెంతొ చూడు
స్వర్ధాల.. లొభాల లొకాన్ని చూడు......
రుజువేది లేదు...రుజువేది లేదు ...
చీకట్లొ సత్యాన్ని చూపించలేను
వెలుగులో ఉన్నదంత నిరూపించలేను

యుద్దలు చేసెంత గొడవేమి లేదు
స్వార్ధాల ఈ జగతిని నే మార్చలేను

-సంతొష్ దరూరి

Tuesday, August 4, 2009

నా సొగసూ పల్లెల్లొ


........నా సొగసూ పల్లెల్లొ
తెల్ల తెల్లంగ పొద్దు తెల్లరి పొతుంటే
చిలకలన్ని గుడు ఒదిలి చెలకలల్ల పొతుంతయ్
గుళ్ళొ దేవుని మైకు నారాయణ పాడుతుంటది
నొట్ల యాప పుల్ల యెసి గొడ్ల తొల్క పొతుంటరు

మొట బావిల లోతు చూస్తే ,
రైతు బతుకులు చెప్పుతుంటయ్.....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ

నిండనే నిండని ఊరి చెరువు
లొట్టా చెట్లకు సుట్టాలైతయ్....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ

చెట్ల మీదా వాలే గువ్వలు
పొద్దే వాలిపొయిందంటయ్.....సొగసూ పల్లెల్లొ .......నా సొగసూ పల్లెల్లొ

-సంతొష్ దరూరి

Monday, June 22, 2009

వెలుగు రేఖవెలుగు రేఖ
------------------------------------------
ఈ చీకటి పొలిమేరల్లో
వెలుగు రేఖ దాగుందని
నా రేపటి పొద్దుల్లొ
స్వర్ణయుగం వేచుందని
చీకటి కక్కే రాత్రులు
నిన్నిక వెక్కిరించబోవని
సామన్యుని యుద్దంలొ
ఊపిరి ఇంకా మిగిలుందని
పరుగాపకు పదముందుకు
నిదరపొయిన సుర్యుడిని మేలుకొలిపేందుకు

-సంతొష్ దరూరి

Tuesday, June 16, 2009

దేవుడు ... జీవుడు ..


దేవుడు ... జీవుడు ..
-------------------------------------------

భగవంతుడు ధనవంతుడు
నిరుపేద కష్టం తానెట్లు ఎరుగెదడు

మేలుకొలుపు లేనిదే నిదరైన లేవడు
ఉదయించే కష్టాలకు ఎదురీతే నా గోడు

ఆరగింపులు హారతులు నైవేద్యం మరువడు
రొట్టె ముక్కొ, బన్ను దిబ్బొ ఆకలికి నా తొడు

పవలింపు సేవతొనే నిదరొయే నా దేవుడు
చేసిన కస్టానికి మురిసి అలుపు తీరే ఈ జీవుడు


-సంతొష్ దరూరి

Monday, June 1, 2009

నవ లోకం


కొత్తాగా కనిపించే ఉదయం, కలతనే చెరిపేయదా
హాయిగా ఈ వీచే గాలి, విసుగునే మరిపించదా
పొద్దులొ పూచి రేయిలొ రాలే, పూవుల జన్మొక వింత
మబ్బులొ ముసురు మంచుగ మారి నా పై కురిసిందంట
నా పయనం సాగాలిక , నా పాదం అలిసే దాక

ఇన్ని వర్ణాలు ఉంటాయంటే నమ్మలేదా సమయం
చినుకును తాకి విరబూసే హరివిల్లును చూసేనే నయనం
కొమ్మల కూసి , కోనలొ ఎగిరే కొకిల గానం వింటా
వంపులు తిరిగే నది వయ్యరం మురిపించేనే దారి వెంటా
నా కవనం సాగాలిక , నా ఊహలు అలిసే దాక

-సంతొష్ దరూరి

Tuesday, May 5, 2009

నా గమనంలొ


నా గమనంలొ
--------------------------
దిశలేని గమనానికి ,దశ మారేదెన్నడొ
నీవు గాని , నేను గాని , ఎవ్వరు గాని..........
వలచి,తలచి విసిగినా... నడచి నడచి అలిసినా.....
రాని అవరొధాలు ..... రాని ఎడతెగని బాధలు
భయం నాస్తి... భాధ నాస్తి ..... నిట్టూర్పుకు స్వస్తి ....

నిన్నెవ్వరు వీడినా గాని
తొడెవ్వరు లేకుంటేనేమి
విశ్వమంతా శూన్యం లొ కలిసిపోయే రోజు రాని
నీ స్వప్నం నీ కొసం ఉద్భవించు గమనంలొ
రెప్ప వేయక ఎదురు చూడు నిర్వాన సౌధం లొ

సంతొష్ దరూరి

Tuesday, April 28, 2009

"సాయం ఛేద్దాం ""సాయం ఛేద్దాం "

కొంత మంది ఏం చెయాలొ తెలియక కాలం గడుపుతూ ఉంటారు,
ఏ బార్లల్లొనొ ,
పేకాటల్లొనొ,
తొక లేని వ్యర్ధ .రాజకీయ మరియు సినీమా చత్త చర్చలు చేస్తుంటారు. ఆలా చేయడం తప్పొ కాదొ మనకు అనవసరం. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే సామర్ద్యం ఉండి [UNPRODUCTIVE] గా దేనికి ఉపయోగపడకుండా బ్రతికే వాల్లను చూస్తే చాల జాలి వేస్తుంది.

కత్తి తొ కూరగాయలు కోసుకోవచ్చు..... హత్యలూ చెయవచ్చు.. కాని అది ఆ కత్తి వడే మనిషి వివేకన్ని బట్టి ఉంటుంది. వివేకనికి వయసు ఉండదు ... కాని దాన్ని సరియైన వయసులో చేస్తే ఒక ఉద్యమం అవుతుంది.
అలంటి ఒక సామజిక ఉద్యమమే ఈ "సాయెం చెద్దాం"
యువతకు ఉండే అవేషానికి సరిహద్దుల దగ్గర తుపాకి పట్టి శత్రువు తొ పొరడి చంపవచ్చు
కాని.......
పొరాడాల్సింది శత్రువుతో కాదు శత్రువుత్వం తొ.
చంపాల్సింది శత్రువుని కాదు శత్రువుత్వాన్ని..
మనుషుల్లో నింపాల్సింది మాత్రం మనవత్వమే .....
ఎది అర్ధం లేని సంభషణ అని మాత్రం అనికొకండి.
సహయం చెసుకుంటూ పొతే మనవత్వ బీజాలని మరొ యుగానికైన మనిషిలొ నాటగలమేమొ.
..................................
ఇంతటితొ నా అర్ధం కాని సంభాషన ఇపొయింది.
ఇక అసలు విషయం ఎమిటంతే........
......................................
యువత మరియు ఇంటర్నెట్ మీద చాల దురబిప్రాయం ఉన్న చాల మందికి ఇదొ కనువిప్పు. దేన్నైనా సరిగ్గ వినియొగించుకుంటే అత్బుతాలు సాదించవచ్చు, అనడానికి ""సాయం ఛేద్దాం " ఒక నిదర్శనం.
అందరూ యువతే అందరూ కలుస్తారు కని... ఏ సినిమాకొ షికారుకొ కాదు సాయం చెయడానికి.

25 ఎప్రిల్ 2009 రొజు జరిగిన ద్వితీయ వార్షిక సభ చూసాక కలిగిన అనుభూతి చాల స్పూర్తి కలిగించింది
HATS OFF TO ALL THE MEMBERS OF SAAYEM CHEDDAM
http://www.saayamcheddam.org/

Join in Orkut Community

ఇది నా స్పందన
సంతొష్ దరూరి

ఎదురు చూస్తా...


ఎడారిలొ దోసిళ్ళతొ , అలుపెరుగని నాకళ్ళతొ
ఎదురు చూస్తా... ఎదురు చూస్తా...

దారులు కనిపించకుంటే,
గమ్యం ఎదొ తెలియకుంటే
నెనే ఒక వెలుగై
నా దారిని వెతుక్కుంట

నాకంటూ ఉంటుందా వక్తిత్వం నా తత్వం
అనుక్షణం మార్చుకుంటే
గమ్యం ఏదని లేదని కూర్చుంటే

నా పయనం ఆపకుండా
ఎదురు చూస్తా... ఎదురు చూస్తా...
-సంతోష్ దరూరి

Monday, April 20, 2009

తెలుగంత అందంగా


తెలుగంత అందంగా
--------------------------
తెలుగంత అందంగా ఆ చీర కట్టీ
నుదుతిపై అద్దిన తొలి పొద్దంత తిలకం
గాలికి ఎగసే కురుల సొయగమే అందం
చిలక పచ్చ చీర నువు కదితే అందం
కటుక దిద్దిన కనుల సైయ్యాటలే అందం
నువు పలికే ప్రతి మాట నే వింటే అందం
-సంతొష్ దరూరి

Wednesday, April 15, 2009

ఓ జ్ఞాపకం


నిన్ను మరపించునా నా హౄదయం
కనుమరుగయ్యెనా ఆ కధనం
మనసులొకటైతె మిగిలిన ఓ జ్ఞాపకం

ప్రతి ఉదయం ఉదయిస్తుంటే, తొలి కిరనం నీవనుకుంటా
చిరుగాలి తాకుతుంటే, నీ చూపని తలచుకుంటా
ఏ పూవో నా పై రాలితే, నీ స్పర్శే దారి వెంటా
ఎద పరిచి ఎన్నలైనా నువు నడిచే దారిని అవుతా.
నీ అడుగుల సవ్వడి వింటే, నా గుండే చప్పుడు అనుకుంట
-సంతొష్ దరూరి

Wednesday, April 8, 2009

ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు

నిలుచుంటావెం విలాసమా ?
వదనం విషాలం పరిష్కారమా ?
విషాదానిది తుఫాను నైజం
ఎగసే అలపై , బిగిసి పిడికిళ్ళు
నిలుచొని అల తల వంచు నేస్తం
-సంతొష్ దరూరి

Friday, April 3, 2009

గుండే తడిమితే గుర్తుకొస్తావు


________________________________________
గుండే తడిమితే గుర్తుకొస్తావు
________________________________________
కనిపించనంత దురంగ ఉన్నా, నీ జ్ఞాపకం మిగిలుందిలే
వెచ్చాగా నా గుండేపై నువు తాకినా గురుతుంది లే
నువు రాసిన లేఖలొ అక్షారాలని, ముద్దడితే మత్తుందిలే
నీ ఉహల్లొ నన్నుండని...
నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ

నువు నడచిన దారుల్లొ నేను ఒంటరినా,
నువు తాకిన నేలను నే ముద్దాడనా,
గుండే తడిమితే గుర్తుకొస్తావు
ఎంత వద్దనుకున్నా ఎదురు పడతావు

నీ ఉహల్లొ నన్నుండని...
నీ జ్ఞపకాలలొ బ్రతికుండనీ
-సంతొష్ దరూరి

Wednesday, April 1, 2009

ఓ వెన్నెల వాన

ఓ వెన్నెల వాన
----------------------
ఓ వెన్నెల వాన , కురవాలి నా పైన
అనువనువు నే తడిసి ఆ వెలుగు లొ కలిసి
ఆ మల్లె పువుల్లొ వలపు మత్తు కై వెతకి
గాలి తెమ్మరతొ కబురంపు నా చెలికి

జాలిగ మేఘాలు చూసి,
జాబిలి పాటకు మురిసి,
కరగి నా కన్నీరునే తుడిచి
ఓదార్చి పొయనే......
-సంతొష్ దరూరి

Tuesday, March 31, 2009

ప్రియ వియొగం


ప్రియ వియొగం
-------------------------
వెదకి చూసినా.... వే వేల క్షణములు
మై మరపించు మందహాసము కొరకు
నీ పలుకు కరువైతే మొగబొయెనే లొకం
ప్రియ లేక యెద రగిలే విరహగ్నిలొ
పువులు ముద్దాడెనే యెద బౄందావనములొ
నీ ఊపిరి తగులకుండ రవళించదు నా మురళి
యుగములన్నీ కనులెదుట కదలిపొతుంటే
నే మిగిలి శిలగ నీ కొసమే వేచి,
ప్రియ వియొగం ఎంత భారమొ తెలిపెద

-సంతొష్ దరూరి

Thursday, March 19, 2009

గలం విప్పాలి గొంతు కలపాలి


లొక్ సత్తా తొనే ఇది సాద్యం
గళం విప్పాలి గొంతు కలపాలి...........
కలం కదలాలి పదం కలపాలి.......
నా దెశం లొ ఏ ఒక్కరు ఆకలితొ నిదర పొకూడదు.
గజం నేలకూడా దాహంతొ నింగి వైపు చూడకూదదు
పారే నదులన్ని ప్రతి పల్లె గొంతును తడపాలి
ఉదయించే సూరిడు చిగురించిన నేల చూసి మురవాలి
గళం విప్పాలి గొంతు కలపాలి...........
కలం కదలాలి పదం కలపాలి.......
కార్మికుడి కొడుకైన కల్లక్టర్ కొడుకైన ఒకే బళ్ళొ చదవాలి
కష్టపడకుండ ఏ ఒక్కడు భొగాలకు అర్హుడు కకూడదు
బ్రతుకు విలువ తెలిసిన వాడికే భవిత పట్టం కట్టలి
పరిపాలన ఏ ఒక్కది అబ్బ సొత్తు కాకూడదు
రాచరికం పొలేదు, రాజకీయం మారలేదు
ఇకనైన మేలుకొండి ఓటు విలువ చాటండి
గళం విప్పాలి గొంతు కలపాలి...........
కలం కదలాలి పదం కలపాలి.......

-సంఘహిత

Thursday, February 12, 2009

జయహొ... నరుడా.జాతి లేదు, మతం లేదు మనమంతా ఒక్కటే,
మనిషి జంతువులంతా ఒక్కటే ఒక్కటే
నీటిలొని చేపైనా, నింగి లొ విహంగమైనా,
నేలమీద నువ్వైన..నువ్వు నమ్మే దెవుడైనా..
మనమంతా ఒక్కటని ఆ దెవుడే చెప్పినా..........

జీవరాసి ములాల్లొ మనమంతా ఒక్కటే
అంటూ డార్విన్ తల బాదుకున్నా ...

మనుగడ పొరాటల్లొ ఎవ్వరైనా ఒక్కటే
అని వర్గ రహిత సమజం ఉండాలని కర్ల్ మర్క్స్ చెప్పినా....

జయహొ... నరుడా.. .. జయహొ...
మేలుకొ నరుడా.....మేలుకొ...
-సంఘహిత

Thursday, February 5, 2009

ప్రేమికుల రొజు

ఒకే పదం, అర్ధాలు మాత్రం కొకొల్లలు, ఎంత నిర్వచించినా.. పూర్తి కాదు.ఎంత చెప్పుకున్నా మిగిలే ఉంటుంది. సంవత్సరానికి ఒక సారి చిగురించేవి కొన్ని, పూసెవి ఇంకొన్ని, రాలిపొయెవి మరి కొన్ని.
Feb 14, మనది కాదు అని కొందరు, మనమెందుకు చెసుకొవలి అని ఇంకొందరు,
పక్క దేశం నుంచి మనకు అన్ని కవాలి ....పెట్రొల్,బట్టలు,బంగారం,డబ్బు .మొదలగునవి.... కాని సంస్కౄతి వద్దు..అంతేనా.?

saint valentine , ప్రెమికులని విడతీయొద్దనే తపనే వాలెంటైన్స్ డే గా మారిన, ప్రపంచ యువతీ యువకుల్ని ప్రెమికులుగా మరుస్తుంది.
పెళ్ళికాని దంపతుల్లా, నీడనిచ్చే చెట్లకు కొత్త నిర్వచనం చెబుతూ , "biological needs" అనే పదానికి అర్ధాలుగా మారేవారు కొందరైతే, dating పేరుతొ చండాలం చేసేవరు మరి కొందరు.
పెద్దలు పరిస్తితులు అనుకూలించక మరిచిపొలేని ప్రియురలిని జ్ఞపకంగా మలుచుకొనేవరు ఇంకొందరు.
చివరకు ప్రెమ పొందలేక ఉన్మాదిగ మరే వాళ్ళు కూడా ఉన్నారు ,
ఈ పరిస్తితులు చూస్తే బాల్య వివహాలు వద్దని చెప్పిన "రజా రాం మొహన్ రాయ్ " తప్పు చేసడెమొ అనిపిస్తుంది.

అయ్యొ ! అసలు విషయం ఇంకా ఉంది. school ప్రేమ , intermediate ప్రేమ, degree ప్రేమ, PG ప్రేమ. అని కొన్ని categories గా విభజించి మరీ సినీమలు తీసేవల్లు దిరెక్టుగ అ యువత గుండెల్లకు గురి పెట్టి మరి తీస్తరు, కళకి వ్యపారనికి ఉన్న గీత చెరిపేస్తు. అందరూ కదులెండి కొంతమంది.


అందరు పరిబ్రమించేది ప్రేమ చుట్టే, అందరు బ్రమించేది ప్రేమనే. కాని..... ?
-సంఘహిత

Tuesday, February 3, 2009

"ముంబై " జవాబు అదుగుతొంది
"ముంబై " జవాబు అదుగుతొంది
ఎవ్వరిది ఆ ఆర్తనాధం
ఎవ్వరిది ఆ చిందిన రక్తం
నది వీదుల్లొ, మరన హొమం,
నాకెందుకుకే అనుకుంటావా..
నిన్న నీ నేస్తల వంతు, నేడొ రేపొ నీ వంతు
ఎం చేద్దాం ?
ఇంకొ పీడకలగా మరిచి పొదామా ?
ఏ తూటా పై మన పేరుందొ ఎదురు చూద్దామా ?
నిలదీయంది నయకుల్ని ,
నిరసించంది ఈ వైనన్ని,
పొరపట్లకు అలవటైన పనికిమలిన స్వర్దాన్ని
నిర్ఘాంతపొయిన ముంబై జవాబు అదుగుతొంది

-సంఘహిత

Thursday, January 29, 2009

నిజమైన నిధులన్నినిజమైన నిధులన్ని పొగొట్టుకుంది ఇప్పుడే
కొహినూరు వజ్రన్ని కాదు
నెమలి సంహసనన్ని కాదు
ప్రచీన శిల్పాల్ని కాదు
సంస్కౄత గ్రంధాల్ని కాదు
నిజమైన దొపిడంతా జరుగుతుంది ఇప్పుడే

ఎంత మందికొచ్చు తల్లి నేర్పిన భాష
కొంచమైన మిగిలుందా కపడుకున్న సంస్కౄతoతా

Wednesday, January 28, 2009

ఎన్నొ ఆశలు

గుండెలొ ఎన్నొ ఆశలు
చుక్కలకెగి పొతోంటె
డొక్కలొ జివ్వని ఆకలి
వెనక్కి లాగుతోంటె
నింగికి నేలకు మద్య వేలడదీసే
వెదవ కష్టం

-సంఘహిత

వరమీయవా ప్రియ

ఒక చిన్న నవ్వు నా పైన విసిరె వరమీయవా ప్రియ
నీ చూపులన్ని నా పైన కురిసె చొరవీయవా ప్రియ

కను పాప పరదాలు నీ చూపునపేస్తె
మనసు పాడే ఆ మౌన గీతాలను ...వినిపించవా ప్రియ

-సంఘహిత

1857 సిపాయీ తిరుగు బాటుక్రాంతి వీరుల గెలుపు బాటలొ
నెత్తురంతా అశ్రువుగ మారె
ఈ భుమిలొ ఇంకిన రక్తపు వాసనలు ఇంకి పొలెదులే
ఆకసాన ఎర్ర రంగై
భరత మాతకు చీర కొంగై
ఆ ఎరుపు రంగు నిలచి పొయే
ప్రతి తూరుపున ఉడయించె చూడు
-సంఘహిత

ఆ సాని వాడల్లొఆ సాని వాడల్లొ పాడెటి పాట
కన్నీల్లు దిగమింగి తనువాడె ఆట

ఆ రంగు మేడల్లొ పరదాల వెనక
మగ జాతి తప్పుల్ని, దాచెసే చొటా

ఆ మల్లె మత్తుల్లొ, మగ నీతి మరచి
మనుషుల పశువుల తెడ మనిషంతా చెరచి

నువ్వు ఎవరని అడిగితె మనిషి అంటవా
నీ ఇంటి పడుచు మొము సాని ఇంట కనరదా

-సంఘహిత

రూపాయి సిక్కలుపొలం దున్నినా ,రాళ్లు మొసినా,
ఇల్లు కట్టినా, ఫైల్లు రాసినా,

ఓ ...
కార్మికుడా,శ్రామికుడా,కర్శకుడా,సేవకుడా,
నీ చమట చుక్క్లన్ని, రూపాయి సిక్కలెరా
-సంఘహిత

ఆకలి రుచులువీళ్ళు గ్రహంతరవసులు కారు
మనిషి సాదించిన ప్రగతికి మరొ పక్క వెలుగు చూడని సాక్షాలు

నేటికి.......

కడుపు ఎండిన బ్రతుకులున్నయి
చిరునవ్వు తెలియని మనుగడలున్నయి

అన్నీ మన మద్యనే..నేటికి.......

నలుక తెలిపే రుచి నాలుగు నిమిశాలైనా
నువ్వు రుచి లెదని పారేసె మెతుకులు... ఒక్కడి ఆకైలైన తీర్చగలవు


-సంఘహిత

"పొలిటికల్ సైంటిస్టులు"


"పొలిటికల్ సైంటిస్టులు"

చదివినొల్లు చదివినట్టు సంపాదన బండెక్కి పొతున్నరు
సన్నాసుల విన్యాసం గద్దెనెక్కి కూర్చున్నరు
విధనాలు తెల్వనొళ్ళు నినాదలు చేస్తున్నరు
పనిలెని పొటుగాళ్ళు జెండాలు పడుతున్నరు
సంక్షెమం సట్టు బండ, ఎవడికెమి ఒరిగిందొ
నీల్ల లాగ నిధులొదిలితె, ఎవరికెంత మిగిలిందొ

కదిలిస్తె చాలు ఎవ్వడినైన.....
గంటలకొద్ది లెక్చర్లిస్తారు
నలుగు గొడల మద్య ఇద్దరికే వినపడెట్టు...

చేయి కలుపవేం మనం
మంచి కొరరేం జనం


"పొలిటికల్ సైంటిస్టులరా" ఈ దేశం మీది కూడా,
చదలు పట్టిన మేదల్లను ఒక్కసారి కడగండి.
-సంఘహిత
-సంఘహిత

నిరీక్షన

నిరీక్షన

నెవ్వెక్కడంటె గుండెల్లొ..

నీ రూపమంటె కల్లల్లొ..

నీ ఙ్నాపకం ఓ వరం నాకు...

కనిపించె తీరం దూరం తెలుపదు..

వినిపించె పిలుపె నెన్ను చేరదు...

నిజమంటె నా కన్నులు చూసెదా..

నా నిరీక్షనంతా నిజం కాదా
-సంఘహిత

సంయయి

నిందలు వస్తె ఎంత, నీటి మబ్బులంతె
నిజం తెలుసుకుంటె, కరిగి పొవునంతె
నిందలు .... నీటి మబ్బులు .. నిజాలు కావులె
తెలిసి మసలుకొ "సంయయి"

చీకటి మంత్రం

నెనన్నది నిజమవుతుంది
నిజమన్నది రుజువవ్తుంది
వెలుగు వానలొ చీకటి మంత్రం
బయట పడలెవు భద్యత యంత్రం
చిక్కులతొ చెలిమెంటొ చిత్రం
తెలుసుకొవొయ్ బ్రతుకు తంత్రం
-సంఘహిత

జై

ఎక్కర ఎక్కు,ఒక్కొ మెట్టు,
జండా పట్టు జై కొట్టు
తల వంచకు ఈ నిమిశమ్
తపంచు ప్రగతి కొసం
ఈ దెశం నీది కుడా
ఈ సంఘం నీ తొనె
-సంఘహిత

మా ద్యెయం


నేల పగిలినా
నెత్తురొచ్చినా

నింగి అరిచినా
ఉరుము చరిచినా

పెనుతుఫానులే
ఎదురు నిలిచినా

పొరాడుట మా నైజమ్
గెలుపు ఒక్కటె మా ద్యెయం

-సంఘహిత

నెను ఎవరొ తెలుసా

నెను ఎవరొ తెలుసా

పలకరించని స్నెహం
నువ్వెరుగని భందం
నిను కొరని పంతం
వినిపించని గానం
కనిపించని రూపం
-సంఘహిత

ఎమౌతాడొ మనిషి


ఎమౌతాడొ మనిషి

తనకొసం వెతుక్కుంటు ఎపుడౌతాడొ మహర్షి

నీ కొసం మలుచుకున్న యంత్రానికి బానిసవై,
ప్రతి ఉదయం ప్రక్రుతి దౌర్భాగ్యనికి నాంది వై

ప్రగతంటూ పాటుబడుతూ
నెన్ను నీవు కొల్పొతివి ,
మనిషంటె నీలా నాలా, ఉండడెమొ కొన్నాల్లకి

మర మనుశులు రజ్యమెలితె,నశిస్తడెమొ మనిషి
పద వెతుకుదాం మరొ రాతి యుగం ఎక్కడుందొ


-సంఘహిత

ఎడారిలొ పడవ

ఎవరికొసం , ఎందుకనొ , ఎడారిలొ పడవ లాగ, అక్కడె పడుండు నువ్వు

నీ నైజం కొల్పొతూ,
నీ చుట్టు ఉన్నదంతా శూన్యంల అనిపిస్తె, కనిపిస్తె
కాల్లిరిగిన ముసలిలాగ, కదలక , మెదలక అక్కడె పడుండు నువ్వు

గొంతుండి  అరవలెక, చేవుండి చేయలెక   
రక్తం బదులుగ పిరికితనం ప్రవహిస్తె

అక్కడే పడుండు..  అక్కడే పడి ఉండు.. 
నివ్వెరపుతుంది  చూడు, నెన్ను చూసి ఈ లొకం

కదలొస్తె,కదలిస్తె,
నిరసిస్తె,నిలదీస్తె,
గెలుపొస్తె,గెలిపిస్తె,
భయంపొయి,బదులిస్తె,
నిజం చెప్పి,నిలదీస్తె

నివ్వెరపుతుంది  చూడు, నెన్ను చూసి ఈ లొకం 

-సంఘ హిత   

ఆశనీదనుకున్నా నీడైన

చికటిలొ కనిపించదులె

లేదనుకోకు ఏ తొడు
రెపటిలొ ఉదయించునులె

ఆశ నిరాశలు లేకుంటె
ఆనందానికి విలువుండదులె

కష్టాలన్ని భారంగుంటె, సుఖాల తీపి తెలియునులె

ఆకలి పాటలు

నా బాట
నెనెక్కని మేట్టు లెదు
దురదుష్టం బాటల్లొ ,

చెప్పులొ రాయది నిత్యం
ఆవేదన పాటల్లొ